వయసు పెరిగే కొద్ది వచ్చే అతి తీవ్రమైన, ప్రమాదకరమైన సమస్య పక్షవాతం(Paralysis ). నిజానికి పక్షవాతం మెదడులో రక్తప్రసరణ సరిగా జరగనప్పుడు.. మెదడులోని రక్తనాళాలు చిట్లి పోయినపుడు సంభవిస్తుంది. మరి ఇలాంటి తీవ్రమైన సమస్య దరి చేరకుండానే.. కొన్ని సూచనలను ముందే తెలుస్తాయా? వాటిని ఎలా గుర్తించాలి? గుర్తించడం వల్ల.. ఆ సమస్య నుంచి నిజంగానే బయటపడొచ్చా? నిపుణులు ఏమంటున్నారు? సాధారణంగా పక్షవాతం వచ్చిన 80 శాతం కేసుల్లో ఒకే లక్షణాలు ఉంటాయి.
వయసు పెరిగే కొద్ది వచ్చే అతి తీవ్రమైన, ప్రమాదకరమైన సమస్య పక్షవాతం(Paralysis ). నిజానికి పక్షవాతం మెదడులో రక్తప్రసరణ సరిగా జరగనప్పుడు.. మెదడులోని రక్తనాళాలు చిట్లి పోయినపుడు సంభవిస్తుంది. మరి ఇలాంటి తీవ్రమైన సమస్య దరి చేరకుండానే.. కొన్ని సూచనలను ముందే తెలుస్తాయా? వాటిని ఎలా గుర్తించాలి? గుర్తించడం వల్ల.. ఆ సమస్య నుంచి నిజంగానే బయటపడొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
సాధారణంగా పక్షవాతం వచ్చిన 80 శాతం కేసుల్లో ఒకే లక్షణాలు ఉంటాయి. అవేంటంటే.. రక్తప్రసరణ సరిగా లేకపోవడం, రక్తనాళాలు చిట్లిపోవడం, మెదడులోని కణాలు చనిపోవడం వల్ల వస్తాయని మనకు తెలుసు. అయితే శరీరంలోని 98 శాతం అనారోగ్యాలకు అధిక బరువే కారణం. ఈ కొలెట్రాల్ సమస్య.. నిద్ర సరిగా లేకపోవడం వల్ల.. వేలకు సరిగా తినకపోవడం వల్ల.. తినే ఆహారంలో సరైన పోషకాహారం లేకపోవడం వల్ల వస్తుంది. అదే పక్షవాతానికి కారణం అవుతుంది. మరి పక్షవాతం వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి?
చూపు మందగించడం, విపరీతమైన తలనొప్పి రావడం, తల తిరుగుతున్నట్లుగా ఉండటం, వాంతులు, నడవలేకపోవడం, అకస్మాత్తుగా కాలు చేయి పని చేయనట్లుగా పోవడం.. ఇలా కొన్ని లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. 3 గంటల్లోనే సరైన వైద్యం అందితే.. ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడొచ్చనేది నిపుణుల మాట. 3 గంటల్లోపు ఆసుపత్రికి వెళ్లి.. డాక్టర్ సమక్షంలో టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ (Tissue Plasminogen Activator) అనే ఇంజెక్షన్ ఇప్పించుకోవాలి. అది మెదడుకి రక్తప్రసరణ చక్కగా అందిస్తుంది. యథావిధిగా మెదడు పని తీరుకి సహకరిస్తుంది. ఈ ఖ్కీఅ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాదాపు 50 శాతం పేషెంట్స్ వెంటనే కాలు, చేయి పనిచేస్తాయి. చాలా త్వరగా కోలుకుంటారు. 3 గంటలంటే ఫర్వాలేదులే అని నిర్లక్ష్యం చేయడం సరికాదు. వీలైనంత వేగంగా ఆసుపత్రికి చేరుకోవడం మంచిది.
మొదటి స్టెప్ :
ఇంజెక్షన్ పేరు తెలుసు కదా అని.. ఏదో ఒక డాక్టర్‌తో వైద్యం చేయించుకోవడం సరికాదు. ఇరవై నాలుగు గంటల పాటు అనుభవజ్ఞుడైన న్యూరాలజిస్ట్(Neurologist) సమక్షంలో ఉండేలా చూసుకోవాలి. సిటీ స్కాన్(CT scan) ఉన్న ఆసుపత్రిలో చేరడం మేలు.
అవగాహన తీసుకుని రావడం:
చాలా దేశాల్లో పక్షవాతానికి ట్రీట్మెంట్ ముందు నుంచి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రమే అటాక్ అయ్యేదాకా వైద్యం మొదలుపెట్టరు. పక్షవాతానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్న వైద్యుడి సలహాలు పాటించడం చాలా ముఖ్యం.
ధర చాలా తక్కువ :
పక్షవాతానికి ఉపయోగించే ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్(Tissue Plasminogen Activator Injection) ధర చాలా ఉంటుందని భయపడాల్సిన పనిలేదు. సామాన్యులకు సైతం అందుబాటు ధరలోనే ఉంటుంది. ఈ ఇంజక్షన్ తీసుకున్న వారిలో 50 శాతం మందికి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో వారు తిరిగి మామూలు మనుషులుగా మారతారు. కాలు, చేయి, మూతి వంటివి యదాస్థితికి వచ్చేస్తాయి. వారి వారి పనులు వాళ్లే చేసుకునేలా ఆరోగ్యవంతంగా మారగలుగుతారు.
గమనిక: నిపుణుల సలహాలతో ఈ వివరాలను అందించాం. ఆరోగ్య పరమైన ఏ చిన్న సమస్య వచ్చినా.. వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.