రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో(Nizamabad) విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో క్రిస్మస్(Christmas) పండగను గ్రాండ్ సెలెబ్రేట్ చేస్తుండగా 13 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు హుటాహుటిన సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి(Hospital) తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పండగ పూట సంతోషంగా గడుపుదామనుకున్న ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు చూస్తే..

కోనరావుపేట(Konaraopeta) మండలం నిజామాబాద్‌కు చెందిన తాళ్లపల్లి శంకర్, సరిత దంపతులకు ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులు జస్వంత్, సుశాంత్ ప్రభుత్వ స్కూళ్లో చదువుతున్నారు. జస్వంత్ కోనరావుపేట ప్రభుత్వ కాలేజ్‌లో ఇంటర్ చదువుతుందగా, ముస్తాబాద్‌లోని గురుకుల పాఠశాలలో సుశాంత్(Sushanth) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ పండగ కోసం సుశాంత్ స్వగ్రామంలోని ఇంటికి వచ్చాడు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ డ్యాన్స్‌లు వేస్తూ ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో సుశాంత్ కింద పడిపోయాడు. సుశాంత్‌కు ఊపిరి ఆడకపోవడంతో(Breathing Problem) ఆందోళన చెందిన కుటుంబసభ్యులు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సుశాంత్ మృతి చెందాడు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కళ్లెదుటే కొడుకుకు గుండెపోటు రావడం, సుశాంత్‌ను కాపాడుకోలేకపోయామని గుండెలు ఆగిపోయేలా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆడిపాడే వయసులో గుండెపోటుతో సుశాంత్ మరణించాడన్న వార్త తెలియడంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.