ఒక వైపు ఉడికించిన గుడ్లు మరో వైపు ఆమ్లెట్లు.. ఈ రెండింటిలో పోషక విలువలు ఎందులో ఎక్కువగా ఉంటాయి. వేటిని ఎక్కువగా వాడాలి. పిలలకు ఏది మంచింది. చూద్దాం.

కోడిగుడ్లు మానిషి ఆహారంలో ముఖ్యమైనదిగా మారింది. చాలా వరకూ సింపుల్ గా గుడ్లను చేసుకుని తినేస్తుంటారు. శాఖాహారులు కూడా చాలామంది మాంసాహారాలు ముట్టుకోకపోయినా.. గుడ్డు వైపు ఆకర్శితులవుతున్నారు. ఇక మన దేశంలో చాలా మందికి ఇష్టమైన ఆహారాలలో గుడ్డు కూడా ఒకటి.

గుడ్లలో శరీరానికి అవసరమైన వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డును రకరకాలుగా వాడుతుంటారు.. ఉడకబెడతా, ఆమ్లెట్ వేస్తుంటారు. కూరల్లో కాంబినేషన్ గా కూడా తింటుంటారు. అయితే ఇక్కడ ఎక్కువ మంది జనాలు వాడేది ఉడకబెట్టిన గుడ్డు మరియు ఆమ్లెట్. వంటి వారికి ఇష్టమైన పద్ధతిలో గుడ్లు వండుకుని తింటారు. అయితే గుడ్లను ఉడకబెట్టి తింటేమంచిదా..? లేక ఆమ్లెట్ వేసుకుని తింటే మంచిదా..? రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? శరీరానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం? రెండిటికి తేడా ఏంటో చూద్దాం.

ఉడకబెట్టిన గుడ్లు: ఉడికించిన గుడ్లలో కొవ్వు తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా తెల్లసొనలో. తక్కువ కొవ్వు , తక్కువ కేలరీలు. బరువు తగ్గాలనుకునే వారు గుడ్డులోని తెల్లసొనను తీసుకుంటారు.

గుడ్లు ప్రోటీన్ యొక్క మూలం, అందకే ప్రొటీన్లు తక్కువగా ఉన్నవారు గుడ్డులోని తెల్లసొనను తీసుకోవడం మంచిది. అంతే కాదు ఉడికించిన గుడ్లు జీర్ణక్రియకు చాలా మంచివి. ఎందుకంటే అవి అదనపు కొవ్వును కలిగి ఉండవు. ఉడికించిన గుడ్లు సులభంగా జీర్ణమవుతాయి.

విటమిన్ ఎ మరియు బి 12 తో పాటు, ఉడికించిన గుడ్లలో ఐరన్ మరియు సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ మూలకాలు శరీరంలో శక్తి మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఆమ్లెట్: ఆమ్లెట్ తయారు చేసేటప్పుడు నూనె జోడించడం వల్ల కొవ్వు మరియు కేలరీల కంటెంట్ పెరుగుతుంది. ఎక్కువ నూనె వాడటం వల్ల ఆమ్లెట్‌లో కొవ్వు శాతం పెరుగుతుంది.

ఆమ్లెట్ వేయించడం వల్ల గుడ్డులోని విటమిన్లు, మినరల్స్ తగ్గిపోతాయి. ఆమ్లెట్‌లో కూరగాయలు మరియు టమోటాలు, వెల్లుల్లి, అల్లం మరియు పచ్చిమిర్చి వంటి మసాలా దినుసులు జోడించడం వల్ల ఇది ఆరోగ్యంగా ఉంటుంది.

ఆమ్లెట్ తయారీలో చాలా నూనె మరియు మసాలాలు ఉపయోగిస్తారు. కాబట్టి, జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అంతే కాదు ఆమ్లెట్‌లో పచ్చసొన మరియు తెలుపు భాగాలు రెండూ ఉంటాయి. కాబట్టి, ఆమ్లెట్‌లో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఆమ్లెట్ తయారు చేసేటప్పుడు నూనె కూడా కలిపి వాడటం వల్ల కొవ్వు మరియు కేలరీల కంటెంట్ పెరుగుతుంది అందుకే ఉడకబెట్టిన గుడ్డే వెరీ గుడ్డు అనవచ్చు. అయితే ఆమ్లెట్ ను కూడా హెల్దీగా వేసుకుంటే మంచిది. కూరగాయలు కలుపుకుని.. తక్కువ నూనె వాడుతూ చేయవచ్చు.

Updated On 31 Dec 2024 2:00 AM GMT
ehatv

ehatv

Next Story