చంద్రముఖీ సినిమా(Chandramukhi Movie)లో రజనీకాంత్(Rajinikanth)చెప్పినట్టు.. జలుబు(Cold) అనేది మందు వేసినా.. వేయకపోయినా.. ఓ నాలుగైదు రోజులు ఇబ్బంది పెట్టకుండా తగ్గదు. అయితే ఈమందులు.. ఆయుర్వేదాలు.. చిట్కాలు ఎందుకూ అంటే.. అది మనల్ని విసిగించకుండా.. ఉపశమనం కోసం మాత్రమే.

చంద్రముఖీ సినిమా(Chandramukhi Movie)లో రజనీకాంత్(Rajinikanth)చెప్పినట్టు.. జలుబు(Cold) అనేది మందు వేసినా.. వేయకపోయినా.. ఓ నాలుగైదు రోజులు ఇబ్బంది పెట్టకుండా తగ్గదు. అయితే ఈమందులు.. ఆయుర్వేదాలు.. చిట్కాలు ఎందుకూ అంటే.. అది మనల్ని విసిగించకుండా.. ఉపశమనం కోసం మాత్రమే. ముక్కు కారడం, చిరాకు, నలతగా ఉండటం, తలనొప్పి, నీరసం, తుమ్ములు.. గొంతునొప్పి, మంట, రుచి లేకపోవడం, ఆకలి లేకపోవడం ఇలా జలుబు వల్ల మనిషిపడే ఇబ్బదులు ఎన్నో..

మరి వాటినుంచి విముక్తి కావాలి అంటే.. ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. తొందరగా తగ్గుంది కదా అని వెంటనే టాబ్లేట్ వేసుకుంటారు. కాని దానికంటే ఎక్కువ ఉపశమనం కావాలి అంటే.. జలుబు చేసిన వెంటనే వంటగదిలోకి పరిగెత్తండి.. అక్కడే మీకు కావల్సిన మెడిసిన్ ఉంది. అది ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే చాలు.. జలుబు విషయంలో మీరే డాక్టర్ మరి.

చాలా చిన్న సమస్య అనుకుంటాం కాని ఈ జలుబు దగ్గు అనేవి చెప్పలేనంతగా చిరాకు పెడతాయి. ఒంట్లో ఉన్న ఒపికనంతటిని పిండేసి వదిలిపెడతాయి. అందుకే సీజనల్ గా, అన్ సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు లాంటి ఇంన్ఫెక్షన్ ల నుండి కాపాడుకోవడానికి అతి తేలికైన చిట్కాలు చూద్దాం.. జలుబు నుండి ఉపశమనం కోసం పసుపు, తులసి బాగా ఉపయోగపడుతాయి... వాటిని విరివిగా వాడటం వలన జలుబు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులను రోజూ ఉదయాన్నే తినండి. ఎటువంటి ఇంన్ఫెక్షన్ దగ్గరకి రావు. జలుబు వచ్చిన వెంటనే కొన్ని తులసి ఆకులు కొంచె పసుపు కలిపి నీటిలో బాగా మరిగించి ఆవిరి పట్టండి జలుబు దగ్గు పారిపోతాయి...

ఈ జలుబు, దగ్గులకు ఇంకో ఉపశమన మార్గం అల్లం. పచ్చి అల్లం కాని శొంఠి అని పిలవబడే ఎండు అల్లం కాని ఆ రెండు జలుబు దగ్గులకు బాగా ఉపయోగ పడతాయి. ఈ అల్లాన్ని కచ్చా కచ్చాగా దంచి టీలో కాని పాలలో కాని నీటిలో కాని బాగా మరిగించి, గొరువెచ్చగా తాగితే జలుబు దగ్గు నుండి ఉపశమనం ఉంటుంది. జలుబు (Cold) చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పడితే అక్కడ నీరు తాగకండి. నీటిని బాగా మరిగించి గోరువెచ్చటి నీటిని గొంతుకు తాకేలా తాగండి. అలా చేస్తే మీ గొంతు కొంచె క్లియర్ అవుతుంది. లవంగం, మిరియాలు లాంటివి బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని గొంతుకు తగిలేలా మింగండి. అది ఇంన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.

సిజనల్ గా జలుబు(Cold), దగ్గు(Cough) వస్తున్నాయి అని తెలిసిన వెంటనే జాగ్రత్తగా ఉండటం మంచింది. బయటకు వెళ్ళినప్పుడు ఇతరుల నుండి జలుబు అంటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తీనేప్పుడు చేతులు తప్పకుండా కడగాలి. ఇలా చిన్న చిన్నవి మర్చిపోతేనే ఇంన్ఫెక్షన్ లు తొందరగా అంటుకునే ఇప్పుడు జలుబు,దగ్గు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది కరోనా. అది వదలని మహంమ్మారిలా..ఇప్పటికీ వెంటాడతూనే ఉంది. ప్రస్తుం కేసులు పెరుగుతున్నాట్టు కేంద్ర హెచ్చరించింది. అందుకే మాస్క్ మెయింటేన్ చేయండి.. గుంపులుగా జనం ఉన్న చోటికి వెళ్లకండి. ఇంట్లో పసుపు పాలు తాగడం.. స్టీమింగ్ లాంటివి అప్పుడుప్పుడు చేస్తా ఉండండి.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రమాదం ఉంటుంది.

Updated On 27 March 2023 12:42 AM GMT
rj sanju

rj sanju

Next Story