వేడి నీటి(Hot Water)లో ఉప్పు(Salt) వేసి పుక్కిలించడం ద్వారా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. గొంతులో ఉన్న కఫం కూడా కరిగిపోతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి, ఈ నీటితో 30 సెకన్ల పాటు పుక్కిలించండి. రోజుకు మూడు, నుంచి నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు.

గొంతు నొప్పి(Throat Pain) రావడం సాధారణం. గొంతు నొప్పి వస్తే తినడానికి, మింగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇంట్లోనే ఉండి చిన్న చిన్న చిట్కాలతో గొంతు నొప్పిని తగ్గించుకునే అవకాశముందని చెప్తున్నారు.

వేడి నీటి(Hot Water)లో ఉప్పు(Salt) వేసి పుక్కిలించడం ద్వారా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. గొంతులో ఉన్న కఫం కూడా కరిగిపోతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి, ఈ నీటితో 30 సెకన్ల పాటు పుక్కిలించండి. రోజుకు మూడు, నుంచి నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. అలాగే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. నిమ్మరసంలో తేనె కలిపి తాగితే గొంతు నొప్పి తగ్గిపోతుంది. దీన్ని రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తాగితే మంచి ఫలితాలు రావొచ్చని చెప్తున్నారు.

గొంతు నొప్పి సమస్యలకు చికిత్స చేయడానికి ఆవిరిని పీల్చాలంటున్నారు. ఒక కుండలో నీటిని మరిగించి, ఆ నీటి నుంచి వచ్చే ఆవిరిని పీల్చాలంటున్నారు. ఈ నీటిలో యూకలిప్టస్ ఆయిల్, పిప్పరమెంటు వంటి కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపితే మంచి ఫలితం ఉంటుందన్నారు. అలాగే హెర్బల్ టీ కూడా గొంతు నొప్పికి మంచి రెమెడీ అంటున్నారు. చామంతి, పిప్పరమెంటు, అల్లం వంటి కొన్ని హెర్బల్ టీలు గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. ఇష్టమైన హెర్బల్ టీని తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.

Updated On 9 Feb 2024 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story