అనుకోకుండానో... తెలిసో తెలియకో చాలా మంది తొందరగా దెబ్బలు తగిలించుకుంటారు. ఎదో ఒకటి తగిలి రక్త వస్తుంది. కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు... లేదా చిన్న చిన్న యాక్సిడెంట్స్ లో కూడా దెబ్బలు తగించుకునే వారు చాలా మంది ఉంటారు. ఆ గాయలు కొంత మందికి తొందరగా తగ్గవు. అటువంటి వారు ఏం చేయాలి. ఏం చేస్తే గాయాలు తొందరగా మానుతాయి చూద్దాం.

ఒంటిపై తగిలిన, కాలిన గాయాలు తొందరగా మానటానికి చిన్న చిన్న వంటింటి వస్తువులతో ట్రీట్ మెంట్ ఇవ్వవచ్చు. అయితే ముందుగా ప్రతీ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్(First Aid Box) మాత్రం ఉండేట్టు చూసుకోవాలి. అది లేకపోతే ఏం చేయాలో చూద్దాం.

గాయలు తగిలిన వెంటనే వాడవలసి ఎమర్జెన్సీ మందు(Emergency Medicine) పసుపు(Turmeric). ఈ పసుపు వలన రక్త స్రావం ఆగిపోతుంది. గాయంలోకి ఎటువంటి బ్యాక్టీరియా(Bacteria) చేరకుండా ఆపేస్తుంది. అందుకే గాయం తగిలిన వెంటనే పసుపు ను గాయంపై వేయాలి. ఇది మన అందరికి అందుబాటులో ఉన్న యాంటీబయోటిక్ అని చెప్పవచ్చు.

గాయం మానిపోవడానికి సింపుల్ మార్గం చామ దుంప. మన కూరకు వాడుకునే చామ దుంపలను మెత్తగా నూరి గాయం పై వేసి కట్టు కట్టిన గాయం తొందరగా మానిపోతుంది...అయితే పెద్ద పెద్ద గాయాలకు కాదు చిన్న గాయాలకు మాత్రమే ఈ చిట్కాను ఉపయోగించాలి.

వెల్లుల్లిపాయ(Garlic)తో కొంచెం ఉప్పు చేర్చి దానిని చూర్ణం లా చేసి... మెత్తటి పేస్టును గాయంపై వేసి కట్టు కట్టిన గాయాలు మాయమౌతాయి. అయితే దీనివల్ల గాయం వల్ల వచ్చిన బాధ తొందరగా తగ్గిపోతుంది. అంతే కాదు వెల్లుల్లికి గాయం తరువాత ఏర్పడే మచ్చ కూడా తగ్గిస్తుందని చెపుతారు.

వేపాకు(Neem Leaves) అన్నింటికి మంచి మెడిసిన్ అని మనం ముందే చెప్పుకున్నాం... లేత వేపాకులను తీసుకుని వాటికి సరిపడా తేనె చేర్చి బాగా నూరండి. నూరిన పదార్ధాన్ని గాయం పై పూతగా ఉపయోగించితే గాయలు తొందరగా మానిపోతాయి.... దాంతో పాటు గాయం వలన ఏర్పడిన మచ్చలు కూడా మాయమౌతాయి...

Updated On 25 March 2023 12:30 AM GMT
Ehatv

Ehatv

Next Story