మన నోరు శుభ్రంగా ఉంటేనే మనకు రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. నోటికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా అది చాలా ఇబ్బంది పెడుతుంది. నోటికి సంబంధించిన చాలా సమస్యలలో ముఖ్యమైనది నోటి పూత. నోరు, నాలుకా ఎర్రగా మారి మంట రావడం.
మన నోరు శుభ్రంగా ఉంటేనే మనకు రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. నోటికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా అది చాలా ఇబ్బంది పెడుతుంది. నోటికి సంబంధించిన చాలా సమస్యలలో ముఖ్యమైనది నోటి పూత. నోరు, నాలుకా ఎర్రగా మారి మంట రావడం. నోటిలో చిన్న చిన్న కురుపులు లేచి నొప్పితో విలవిలలాడుతారు కొంత మంది. ఇటువంటి సమస్యకు చిన్న చిన్న వంటింటి వస్తువులతో పరిష్కారం లభిస్తుంది. అవేంటో చూడండి.
బాగా నోరు పూసినప్పుడు పటిక బెల్లం దొరుకుతుంది. దానిని నీటిలో కరిగించి ఆ నీటిని గంటకి కాని అరగంటకు కాని ఒక సారి పుక్కులించి వేయండి... నోటిలో వేడి తగ్గి చల్లపడతుంది. నోటి పూత కూడా మాయమౌతుంది.
కొంచెం కష్టమైన పనే అయినా సరే ఓపికగా.. జామ చెట్టు( ఆకులను కాని పచ్చి జామ కాయలను కాని బుగ్గన పెట్టుకుని మెత్తగా నమలండి తారువాత ఉమ్మెయండి. అలా రోజుకు ఒక సారి కాని రెండు సార్లు కాని చేస్తే నోటి పూత కొట్టుకుపోతుంది. ఇలా చేస్తున్నప్పుడు నోటిలో జామ ఆకులు రాపిడి తగిలి మంట పెరుగుతుంది. కాని ఆ మంటకు తట్టుకుంటే నోటి పూత తగ్గుతుంది.
వేప చిగుళ్ళను సేకరించి దానికి కొంచె ఉప్పు పసుపు చేర్చి నోటిలో వేసుకుని మెత్తగా నమిలి ఊసేయాలి. వేపలో చేదు గుణం, పసుపులో ఉన్న ఆంటీ బయాటిక్ మెడిసిన్, ఉప్పులో ఉండే లవణ పదార్ధం నోటిలోని పుండ్లను, నోటి పూతను తగ్గేలా చేస్తుంది. నోటిని ఫ్రెష్ గా మారుస్తుంది. ఇది రోజుకు రెండు సార్లు చేస్తే చాలు. రెండు మూడు రోజుల్లో నోటి పూతక, పుండ్ల నుండి విముక్తి లభిస్తుంది.
అంతే కాదు నోటి పూత వచ్చిన వారు రోజూ పసుపు కొంచెం, ఉప్పు కొంచెం కలిపి పళ్ళు తోముకుంటే చిగుళ్ళు కూడా దెబ్బతినకుండా ఉంటాయి. నోటి పూత తగ్గుంది.వేప పుల్లతో పళ్లు తోముకున్నా సరే నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.... నోరు ఫ్రెష్ అవుతుంది.