మూత్రపిండాలను హెల్తీగా ఉంచుకోవడంలో కొన్ని ఫుడ్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి.

కిడ్నీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే..!
మూత్రపిండాలను హెల్తీగా ఉంచుకోవడంలో కొన్ని ఫుడ్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటివల్ల కిడ్నీ సమస్యలు దూరంగా ఉంటాయని చెప్తున్నారు. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కిడ్నీలు హెల్తీగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు, సమస్యలు రాకూడదనుకునేవారు తమ డైట్లో ఆకుకూరలను చేర్చుకోవాలని అంటున్నారు. ఇవి కిడ్నీలు హెల్తీగా ఉండేలా చేస్తాయి.
ఉప్పు కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది హానికరం కాబట్టి ఉప్పు అధికంగా ఉండే ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండండి. రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌లో కూడా ఉప్పు తగ్గించి తీసుకుంటే మంచిది.
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు యాపిల్‌ను డైట్లో చేర్చుకోవచ్చు. ఎండుద్రాక్ష, పైనాపిల్, జామ వంటి వాటిని కూడా డైట్లో తీసుకోవచ్చు.
బ్రౌన్ రైస్ కూడా కిడ్నీల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. మాంసం, చేపలు, డ్రై ఫ్రూట్స్, పప్పు ధాన్యాలు, మిల్లెట్స్ తింటే మంచిది.
అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
