మ‌న దేశంలో టీ, కాఫీ లేకుండా జ‌నాలు జీవించలేని ప‌రిస్థితి. కొంతమందికి టీ, కాఫీ అంటే పిచ్చి. రోజుకు 3-4 సార్లు తాగుతారు. అయితే ఇవి రుచి కోణం నుండి మంచిగా ఉన్నా..

మ‌న దేశంలో టీ, కాఫీ లేకుండా జ‌నాలు జీవించలేని ప‌రిస్థితి. కొంతమందికి టీ(Tea), కాఫీ(Coffee) అంటే పిచ్చి. రోజుకు 3-4 సార్లు తాగుతారు. అయితే ఇవి రుచి కోణం నుండి మంచిగా ఉన్నా.. ఈ రోజుల్లో ఆరోగ్య(Health) కోణం నుండి జాగ్ర‌త్త‌లు తీసుకోవడం ప్రారంభించారు. బరువు తగ్గడానికి గ్రీన్ టీ(Green Tea) తాగే వారిని మ‌నం చూస్తుంటాం. కానీ మీరు గ్రీన్ కాఫీ(Green Coffee) గురించి విన్నారా? తాజాగా గ్రీన్ కాఫీ ట్రెండ్ కూడా మొదలైంది. గ్రీన్ కాఫీ ఆరోగ్య దృక్కోణం నుండి చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తున్నారు. దీన్ని తాగడం వల్ల బరువు(Weight) తగ్గడం తేలికవుతుంది. గ్రీన్ కాఫీ తాగడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల(Benefits) గురించి తెలుసుకుందాం.

గ్రీన్ కాఫీ అంటే ఏమిటి?

గ్రీన్ కాఫీ నిజానికి కాఫీ గింజలను కాల్చకుండా తయారుచేస్తారు. బీన్స్ వేయించి గ్రైండ్ చేయడం ద్వారా సాధారణ కాఫీ తయారు చేస్తారు. దీని కారణంగా అందులో ఉండే ముఖ్యమైన పోషకాలు ఏ మాత్రం తగ్గవు.

గ్రీన్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు(Benefits of Green Coffee)..

గ్రీన్ కాఫీలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. తద్వారా చర్మం(Skin), జుట్టు(Hair)ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

గ్రీన్ కాఫీ బరువును నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. గ్రీన్ కాఫీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు పెరగకుండా చేస్తుంది.

గ్రీన్ కాఫీ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర(Sugar) స్థాయి అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ షుగర్ లెవల్స్‌(Sugar Levals)ను నియంత్రిస్తుంది. ఇది టైప్-2 డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది.

గ్రీన్ కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గిస్తాయి. రక్త నాళాల పనితీరును మెరుగుప‌రుస్తాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గ్రీన్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీర జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయకారిణిగా ఉంటుంది. గ్రీన్ కాఫీ తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది. శక్తి లోటు ఉండదు.

Updated On 20 Jan 2024 10:11 PM GMT
Yagnik

Yagnik

Next Story