చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి ఆముదం నూనెతో మంచి ఉపశమనం లభిస్తుంది.
క్యాస్టర్ ఆయిల్....దీన్ని తెలుగులో ఆముదం నూనె అంటారు. పూర్వ కాలంలో ఆముదం నూనెను ఎక్కువగా వాడేవారు. ఆముదం నూనెతో అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా... ఆముదమా అని ఆశ్చర్యపోతున్నారా? అదే.. మన దేశంలో కొన్ని శతాబ్దాల నుండి దీన్ని ఉపయోగిస్తున్నారు. సహజంగా లభించే ఈ ఆముదంలో ఎన్నో పోషకాలున్నాయి. మరీ ముఖ్యంగా రిసినోలియెక్ ఆమ్లం, ఒమెగా-6 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇతో పాటు అనేక ఖనిజ లవణాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇది చర్మ సమస్యలకు, కురుల సమస్యలకు చాలా సులభంగా చెక్ పెట్టగలదు. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాల వల్ల అనారోగ్య సమస్యలు సైతం తగ్గిపోతాయి. ఆముదంతో ఆరోగ్యానికి ఏలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి ఆముదం నూనెతో మంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని ఎలా వాడాలంటే.. ముందుగా ఆముదంలో మెత్తని క్లాత్ ను ముంచి కీళ్ల నొప్పులున్న చోట గట్టిగా చుట్టాలి. ఆ తర్వాత వేడి నీటి బ్యాగ్ పెట్టుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
క్యాస్టర్ ఆయిల్ కళ్ల కింద నల్లటి వలయాలు పోవడానికి చక్కగా పనిచేస్తుంది. క్యాస్టర్ ఆయిల్ ని రెండు చుక్కలు తీసుకొని వేళ్ళతో కన్ను చుట్టూ పెట్టి ఐదు నిమిషాలు మర్దన చేయాలి ఇలా రోజు చేయాలి, ఇలా చేయడం వలన కళ్ల కింద నల్లటి వలయాలు పోతాయి.
ఆముదం నూనె జుట్టు పెరగడానికి చాలా చక్కగా పనిచేస్తుంది ఈ ఆముదం నూనె వారానికి మూడు సార్లు జుట్టుకి పెట్టుకోవడం వలన జుట్టు బాగా పెరిగి చుండ్రు లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అయితే ఆముదం నూనె జుట్టుకి పెట్టుకునేటప్పుడు కొబ్బరి నూనె కూడా కలిపి తీసుకోవాలి. అయితే ఆముదం నూనె 1 స్పూన్ తీసుకుంటే కొబ్బరి నూనె 2 స్పూన్స్ తీసుకోవాలి ఆముదం నూనె జీగాటగా ఉండటం వలన కొబ్బరి నూనె కలపడం మంచిది. జుట్టుకు నూనె పెట్టిన తరువాత ఐదు నుండి పది నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేయడం వలన తల బాగంలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరగడానికి చక్కగా సహాయపడుతుంది.
ఆముదం నూనె మరియు ఆలివ్ ఆయిల్ రెండిటినీ కలిపి కన్ను రెప్పలకి, ఐ బ్రోస్ కి పెట్టడం వలన ఐ బ్రోస్ త్వరగా పెరగడంతో పాటు నలుపు రంగులో కనిపించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా వరుసగా పదిహేను రోజులు వాడితే చక్కగా కనిపిస్తాయి.
ఆముదం నూనె చర్మ సౌందర్యానికి అద్బుతమైన ఔషదం అని చెప్పవచ్చు, ఆముదం నూనెను చర్మం పైన పూతలాగా పూయాలి ఇలా చేయడం వలన చర్మం బిగుతుగా అవ్వడమే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయి. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆముదంలో ఉండే ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ... చర్మం పైన పూయడంతో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ది చెంది, మచ్చలు పోతాయి.
తరచుగా నడుము నొప్పితో బాధపడేవారికి ఆముదం చక్కని మందుగా పని చేస్తుంది. ఆముదం నూనెతో 15-20 నిమిషాల పాటు మర్దన చేసుకుని వేడి నీటి బ్యాగ్ పెట్టుకుంటే నడుము నొప్పికి సులభంగా చెక్ పెట్టేయొచ్చు. సులభమవుతుంది.
అప్పుడప్పుడు మనలో చాలా మందికి చిన్న చిన్న గాయాలవుతుంటాయి. అలాంటి సమయంలో ఆముదంలో ఉండే రిసినోలియెక్ ఆమ్లం ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి చిన్న చిన్న గాయాలు అయిన చోట వీటిని రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా ఆముదంలో కొంచెం దూదిని ముంచాలి. దీన్ని దెబ్బ తగిలిన చోట రాయాలి. చిన్న చిన్న గాయాలపైనా దీన్ని రాసుకోవచ్చు. అయితే పెద్ద దెబ్బలు తగిలితే మాత్రం డాక్టర్ ను సంప్రదించడం మరచిపోవద్దు.