సీజనల్ గా వచ్చే నేరేడు పండు(Jamun Fruit)లో.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో ముఖ్యంగా.. కాల్షియం, మెగ్నేషియం, విటమిన్ సి, విటమిన్ బి లాంటి ఎన్నో ప్రయోజన కారకాలుున్నాయి. అందుకే నేరుడుపండు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పండు. ఇక వీటివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. కొంత మంది అస్సలు వీటిని తినకూడదు. మరి వాటి వివరాలు తెలుసుకుందాం..

సీజనల్ గా వచ్చే నేరేడు పండు(Jamun Fruit)లో.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో ముఖ్యంగా.. కాల్షియం, మెగ్నేషియం, విటమిన్ సి, విటమిన్ బి లాంటి ఎన్నో ప్రయోజన కారకాలుున్నాయి. అందుకే నేరుడుపండు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పండు. ఇక వీటివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. కొంత మంది అస్సలు వీటిని తినకూడదు. మరి వాటి వివరాలు తెలుసుకుందాం..

నేరుడుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని చూస్తే.. నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెస్థాయిలను కంట్రోల్ చేస్తుందిఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయమహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచిది.

నేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.నేరేడు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాదు నేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.ఇక వాటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో
సహాయపడుతుంది. నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది.

ఇక నేరేడు పండు వల్ల.. ఎంత ఉపమోగం ఉంటుందో.. అంతే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయి.

నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం.అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

నేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ఉంది. నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని,వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నేరేడు పండ్లలో కాల్షియం, విటమిన్-సి, పొటాషియం, మినరల్స్ శిశువు ఎముకలుపటిష్టపరచడానికి సహాయపడతాయని, అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదు.

Updated On 4 July 2023 1:46 AM GMT
Ehatv

Ehatv

Next Story