Bella Messi 10 Years Old Girl : ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్న పదేళ్ల పాప! కనికరం లేని దేవుడు
ఆడి పాడే వయసులో నరకయాతనను అనుభవిస్తోందా చిన్నారి! ఆ చిన్నారి కష్టాన్ని చూసి తల్లిదండ్రులే కాదు, మనసున్న ప్రతీ ఒక్కరు కంటతడి పెడుతున్నారు. భరించలేనంత నొప్పితో పదేళ్ల ఆ పాప అనుక్షణం బాధపడుతోంది. ఏదీ పట్టుకోలేదు. కదల్లేదు, మెదల్లేదు. ఆ పాపకు ఏదైనా వస్తువు తగిలినా తట్టుకోలేదు. ఈ భూమ్మీద అత్యంత అరుదైన వ్యాధి ఆ పాపకు సోకింది.

Bella Messi 10 Years Old Girl
ఆడి పాడే వయసులో నరకయాతనను అనుభవిస్తోందా చిన్నారి! ఆ చిన్నారి కష్టాన్ని చూసి తల్లిదండ్రులే కాదు, మనసున్న ప్రతీ ఒక్కరు కంటతడి పెడుతున్నారు. భరించలేనంత నొప్పితో పదేళ్ల ఆ పాప అనుక్షణం బాధపడుతోంది. ఏదీ పట్టుకోలేదు. కదల్లేదు, మెదల్లేదు. ఆ పాపకు ఏదైనా వస్తువు తగిలినా తట్టుకోలేదు. ఈ భూమ్మీద అత్యంత అరుదైన వ్యాధి ఆ పాపకు సోకింది. ఆస్ట్రేలియాకు(Australia) చెందిన బెల్లా మెసి ఫ్యామిలీతో(Bella Messi ) కలిసి హాలీడే ట్రిప్ కోసం ఫిజీ టూర్‌కు(Fiji Tour) వెళ్లింది. అక్కడ ఆ పాప కుడి పాదానికి ఇన్‌ఫెక్షన్(Infection) సోకింది. పొక్కులు(Blisters) వచ్చాయి. భరించలేనంత నొప్పితో ఆ పాప విలవిలలాడిపోయింది. పాప పడుతున్న బాధను చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే డాక్టర్లకు చూపించారు.
వైద్య పరీక్షలన్నీ జరిపిన తర్వాత డాక్టర్లు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. కాంప్లెక్స్ రీజినల్ పెయిన్ సిండ్రోమ్‌తో(Complex Regional Pain syndrome) పాప బాధపడుతున్నదని తేల్చారు. ఈ వ్యాధికి చికిత్స లేదు. ఈ రోగం జీవితాంతం అంటిపెట్టుకునే ఉంటుంది. దీర్ఘకాలికంగా నొప్పులను కలిగిస్తుంది. విపరీతమైన మంటతో అవయవాలను కదిలించలేరు. బెల్లా మేసి విషయంలో కాలి భాగం కదలకుండా ఉండిపోయింది. ఫలితంగా ఎటూ కదల్లేదు. కాలు కూడా కదిపే స్థితిలో లేని ఆ పాప ఇక స్కూల్‌కేం వెళుతుంది. ఇప్పుడు మంచానికే పరిమితమయ్యింది. మానవాళి చరిత్రలో అత్యంత అరుదైన వ్యాధిగా సీఆర్‌పీఎస్‌ను చెబుతుంటారు డాక్టర్లు. ప్రస్తుతం గోఫండ్‌మీ విరాళాల సేకరణ ద్వారా అమెరికాకు తీసుకెళ్లి బెల్లాకు చికిత్స అందిస్తోంది ఆమె తల్లి. ట్రీట్‌మెంట్ అయితే ఇస్తున్నారు కానీ ఆ పాప కోలుకుంటుందన్న గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు డాక్టర్లు.
