Avoid These Foods to After Eating Peanuts: వేరుశెనగ తో పాటుగా ఈ 4 ఫుడ్స్ తినకండి.. ఎంత గ్యాప్ ఇవ్వాలంటే..?
వేరుశెనగ లేదా పల్లీలు వీటిని ఇష్టపడనివారు ఉండరు. ఎందుకంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. వివిధ పోషకాలు కట్టగట్టినట్టుగా ఉంటాయి వేరు శెనగ. చాలామంది స్కాన్స్ గా, స్టఫ్ గా పల్లీలను తింటుంటారు. మరీ ముఖ్యంగా ఈ చలికాలంలో వేరుశెనగ తినడానికి ఇష్టపడని వారు ఉండరు. పచ్చి పల్లీలను రకరకాలుగా తినవచ్చు. కాల్చి, వేయించి, ఉడకబెట్టి.. ఇలా రకరకాలుగా తినవచ్చు. నానబెట్టిన వేరుశెనగలను రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఆ రోజుకి కావల్సిన శక్తి అందడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలుగుతాయి.
పల్లీలు రోజు కొద్ది మోతాదులోతిసుకుంటే.. మంచిది. అయితే ఇవి తినకూడని వారు కూడా ఉన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ , గుండె సమస్యలు ఉన్నవారు వేరుశెనగ తినకపోవడం చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్, కాపర్, మెగ్నీషియం, జింక్, కార్బోహైడ్రేట్లు, సోడియం, ఫాస్పరస్ మరియు అనేక ఇతర విటమిన్లు కూడా ఉన్నాయి.
అయితే వేరుశెనగలు తిన్నవారు కొన్ని పదార్ధాలను తీసుకోకూడదు. వాటితో కలిపి తీసుకోకూడదు.. అవి తినన తరువాత కూడా ఓ 30 నిమిషాల దాకా అసలు ముట్టుకోకూడని పదార్ధాలు ఏంటోతెలుసా..?
నీరు:
పల్లీలు తిన్నాక వెంటనే నీళ్లు తాగకండి. అలా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే.. వీటిలో వేరుశెనగ నూనె ఉంటుంది కాబట్టి ఆ నీటిని వెంటనే తాగితే గొంతునొప్పి, చికాకు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వేరుశెనగ తిన్న వెంటనే నీళ్లు తాగకుండా కాస్త గ్యాప్ ఇచ్చి తాగండి.
పాలు:
ఇక పల్లీలుతిన్న వెంటనే పాలు కూడా తాగకూడదంట. ఎందుకంటే పల్లీలలో ఎక్కువనూనె ఉంటుంది కాబట్టి.. వెంటనే పాలు తాగితే జీర్ణశక్తి తగ్గుతుంది. దాంతో పొట్టకు సబంధించిన సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. అంతే కాదు గొంతు సమస్యలు కూడా వస్తాయి.
చాక్లెట్:
వేరుశెనగ తిన్న ఒక గంట వరకూ చాక్లెట్ లు తినకండి. అలా తింటే అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. వేరు శనగ అలెర్జీ అంటే ఇది తప్పక పాటించాలి. అవసరం అయితే బెల్లం పాకంలో వెరుశేనగ వేసి.. పల్లీ పట్టీ చేసుకుంటే.. చాక్లెట్ మాదిరి తినేస్తారు పిల్లలు. అది రక్తం పెరగడంలో సహాయపడుతుంద.ి
ఐస్ క్రీమ్:
వేరుశెనగలో నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐస్ క్రీం తినకూడదు. ఎందుకంటే వేరుశెనగ సహజంగా వేడిగా ఉంటుంది. ఐస్ క్రీం చల్లగా ఉంటుంది కాబట్టి వేరుశెనగ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తింటే గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.
పుల్లటి పండ్లు:
నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి పుల్లటి పండ్లు కూడా పల్లీలు తిన్న తరువాత తినకూడదు. ఇలా తింటే అనారోగ్యంకోరి తెచ్చుకున్నట్టే. మరీముఖ్యంగా అలెర్జీ సమస్య ఉన్నవారు ఉంటే వారు ఇలా తినడం వల్ల.. వెంటనే నొప్పులు, దగ్గు వంటి అనేక సమస్యలు వస్తాయి.