మరచెంబులో నీళ్లు(Marechembu) తాగే రోజులు కావివి! నల్లా తిప్పేసుకుని నీళ్లు తాగే రోజులు కూడా పోయాయి.
మరచెంబులో నీళ్లు(Marechembu) తాగే రోజులు కావివి! నల్లా తిప్పేసుకుని నీళ్లు తాగే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు బయటకు వెళితే చాలు వాటర్ బాటిల్(Water Bottle) కొనేసుకోవడం.. గటగటమని తాగేయడం! అక్కడికి అదే పరిశుభ్రమైన వాటరైనట్టు! అసలు ప్లాస్టిక్ బాటిల్(Plastic bottle) నీళ్లు తాగడం ఎంత డేంజరో తెలుసా? ఆ నీళ్లు తాగితే రక్తపోటు వస్తుందట! ఇదేదో గాలి కబురు కాదు. ఆస్ట్రియాకు(austria) చెందిన డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పిన విషయం!
ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగటం ఆపేసి, రెండువారాల పాటు నల్లా నీళ్లు తాగిన వారిలో రక్తపోటు(Blood pressure) తగ్గుదల కనిపించిందని వారు చెబుతున్నారు. మనం తాగే నీళ్లలో, ఆహార పదార్థాల్లో మైక్రోపాస్టిక్ కణాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు కారణం ప్లాస్టిక్ బాటిల్ నీళ్తు తాగడం, ప్లాస్టిక్ జార్‌లలో నిలువ చేసిన ఆహారాన్ని తినడం అని చెబుతున్నారు. అయిదు మిల్లీమీటర్ల పొడవున్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు పేగులు, ఊపిరితిత్తులు, రక్తనాళాలలోకి చేరుతున్నాయని, ఫలితంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశోధకులు చెప్పారు.