కండోమ్స్‌ ఉపయోగిస్తున్నారా? అయితే ప్రమాదంలో పడినట్టే! అదే పనిగా కండోమ్స్‌(Condoms) వాడితే మాత్రం మీరు నిర్వీర్యులు కావడం గ్యారంటీ.

కండోమ్స్‌ ఉపయోగిస్తున్నారా? అయితే ప్రమాదంలో పడినట్టే! అదే పనిగా కండోమ్స్‌(Condoms) వాడితే మాత్రం మీరు నిర్వీర్యులు కావడం గ్యారంటీ. అంతేనా కేన్సర్‌(cancer)కూడా రావచ్చు. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోవచ్చు. ఉత్తినే చెప్పడం లేదు. వినియోగదారుల భద్రత వేదిక మామావేషన్‌ సంస్థ ఓ అధ్యయనంలో ఈ షాకింగ్‌ విషయాలు తెలిశాయి. పర్యావరణంతో కలిసిపోనటువంటి శాశ్వత రసాయనాలుగా పేర్కొనే పీఎఫ్‌ఏఎస్‌(PFAS)కెమికల్స్‌ను కండోమ్స్‌ తయారీలో వాడుతున్నారని మామావేషన్‌ సంస్థ చెబుతోంది. ట్రోజన్‌ ఆల్ట్రా థిన్‌ కండోమ్స్‌(Trojan Ultra Thin Codoms),కే-వై జెల్లీ క్లాసిక్‌ లూబ్రికెంట్‌(K-Y Jelly Classic Lubricant) వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ ఉత్పత్తులతో పాటు పలు కంపెనీల ఉత్పత్తుల్లో పీఎఫ్‌ఏఎస్‌ కెమికల్స్‌ను ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు ఆ సంస్థ గుర్తించింది. పీఎఫ్‌ఏఎస్‌ కెమికల్స్‌ మహా డేంజర్‌. పర్‌-అండ్‌ పాలీఫ్లూలోఆల్కైల్‌ సబ్‌స్టాన్సెస్‌ను పీఎఫ్‌ఏఎస్‌ కెమికల్స్‌ అంటారు. 15 వేలకు పైగా సింథటిక్‌ కెమికల్స్‌తో దీన్ని తయారు చేస్తారు. ప్లాస్టిక్‌(Plastic)కంటే ప్రమాదకరం. ఎన్నేళ్లయినా పీఎఫ్‌ఏఎస్‌ కెమికల్స్‌ నీరు(Water),అగ్ని(Fire), నూనె(oil),గ్రీజ్‌(grease) వంటి ఏ పదార్థంతోనూ కలిసిపోవు. వీటిని శాశ్వత రసాయనాలు అనేది ఇందుకే! పీఎఫ్‌ఏఎస్‌ కెమికల్స్‌ కలిసిన కండోమ్స్‌, లూబ్రికెంట్స్‌ను వాడితే అంతే సంగతులు. టెంపరరీగా పిల్లలు పుట్టకుండా కండోమ్స్‌ వాడుతున్నారు సరే, అదే పనిగా వాడితే మాత్రం ఇక శాశ్వతంగా పిల్లలు పుట్టరు. దీంతో పాటు కేన్సర్‌ రావచ్చు. కాలేయం దెబ్బతినవచ్చు. థైరాయిడ్‌ సమస్యలు తలెత్తవచ్చు. ఇకపై కండోమ్‌ వాడేముందు ఓ సారి ఆలోచించుకోండి!

ehatv

ehatv

Next Story