సాధారణంగా నెలసరి(Menstrual Cycle) 28 రోజులకే వస్తుంది. కొందరికి ఆలస్యమవుతుంది. కొందరికి మాత్రం 40 రోజులు దాటినా నెలసరి రాదు. నెలసరి ఆలస్యం కావడంతో కొందరు మహిళలలు ఆందోళన చెందుతుంటారు. ఎప్పుడు వస్తుందో తెలియని పీరియడ్స్(Periods) కారణంగా బయటకు వెళ్లాలంటే వారు భయపడతారు. ఒక్కసారిగా బరువు తగ్గడం(Loosing weight), అధిక బరువు(Over weight), ఒత్తిడి(Stress), అతిగా వ్యాయామం చేయడం, గర్భ నిరోధక మాత్రలు వాడడం, పీసీవోడీ, డయాబెటిస్ అదుపులో లేకపోవడం, హైపర్ థైరాయిడ్ వంటివి నెలసరి ఆలస్యానికి కారణమంటున్నారు.
సాధారణంగా నెలసరి(Menstrual Cycle) 28 రోజులకే వస్తుంది. కొందరికి ఆలస్యమవుతుంది. కొందరికి మాత్రం 40 రోజులు దాటినా నెలసరి రాదు. నెలసరి ఆలస్యం కావడంతో కొందరు మహిళలలు ఆందోళన చెందుతుంటారు. ఎప్పుడు వస్తుందో తెలియని పీరియడ్స్(Periods) కారణంగా బయటకు వెళ్లాలంటే వారు భయపడతారు.
ఒక్కసారిగా బరువు తగ్గడం(Loosing weight), అధిక బరువు(Over weight), ఒత్తిడి(Stress), అతిగా వ్యాయామం చేయడం, గర్భ నిరోధక మాత్రలు వాడడం, పీసీవోడీ, డయాబెటిస్ అదుపులో లేకపోవడం, హైపర్ థైరాయిడ్ వంటివి నెలసరి ఆలస్యానికి కారణమంటున్నారు. ప్రతి నెలా నెలసరి ఆలస్యమైతే ఈ చిట్కాతో సమస్య పరిష్కరం చేసుకోవచ్చంటున్నారు. ఇంట్లోనే ఓ రెమిడీని(Remedy) చేసుకొని ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు(Experts) వెల్లడిస్తున్నారు. నెలసరి సమయానికి వారం రోజులు ముందు నుంచి ఈ ద్రవణాన్ని తాగినే సమయం ప్రకారం నెలసరి వస్తుందని చెప్తున్నారు.
ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం: ఓ గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీరు(Water) పోసుకుని వేడి చేయాలి. నీరు కొంత వెడిగా అయిన తర్వాత ఒక స్పూన్‌ను కొద్దిగా దంచిన నువ్వులను(Sesame seeds) వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు(Turmeric), పావ్ స్పూన్ శోంఠి పొడి వేసి కనీసం 10-12 నిమిషాలపాటు మరిగించాలి. నీరు సగమయ్యేంతవరకు వేడి చేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిలో అరస్పూన్ బెల్లం(Jaggery) వేసి కలుపుకొని తాగాలి. ఇలా మీ నెలసరి సమయానికి వారం ముందు నుంచి దీనిని సేవిస్తే సకాలంలో పీరియడ్స్ వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.