Amiba Bacteria In Pakistan : పాక్‌లో అమీబా కల్లోలం, 11 మంది ప్రాణాలు తీసిన బ్యాక్టీరియా
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాకిస్తాన్‌కు(Pakisthan) ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఆ దేశంలోని పలు రాష్ట్రాలలో మెదడును తినే అమీబా(Amiba) వ్యాపిస్తోంది. నేగ్లేరియా ఫౌలెరి(Naegleria fowleri) అనే పిలిచే ఈ బ్యాక్టీరియా ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు తీసింది. కరాచీలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో గత రెండు వారాల్లో ఈ అమీబా కారణంగా ముగ్గురు మరణించారు.

Amiba Bacteria In Pakistan
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాకిస్తాన్‌కు(Pakisthan) ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఆ దేశంలోని పలు రాష్ట్రాలలో మెదడును తినే అమీబా(Amiba) వ్యాపిస్తోంది. నేగ్లేరియా ఫౌలెరి(Naegleria fowleri) అనే పిలిచే ఈ బ్యాక్టీరియా ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు తీసింది. కరాచీలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో గత రెండు వారాల్లో ఈ అమీబా కారణంగా ముగ్గురు మరణించారు. తాజాగా అద్నాన్ అనే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు సమాచారం. పాకిస్తాన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మెట్రోపాలిస్‌లోని కరాచీ బఫర్ జోన్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి నైగ్లేరియా కారణంగా చనిపోయాడు. గత మూడు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడిన ఆ వ్యక్తిని ఆ ఏకకణజీవి చంపేసింది. ఈ వ్యాధి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇది అరుదైన ప్రాణాంతక అమీబా అని, ఇది మంచినీటి(Water) వనరులలో వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. క్లోరినేషన్ చేయని కొలనులలో ఈతకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముక్కులోకి నీరు ప్రవేశించేందుకు అవకాశమిచ్చే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
