శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సంపూర్ణ పోషకాహారం ఉన్నవాటిని మనం ఆహారంగా తీసుకోవాలి.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సంపూర్ణ పోషకాహారం ఉన్నవాటిని మనం ఆహారంగా తీసుకోవాలి. అటువంటి రెండు ఆహారాలు ఉసిరి, బీట్‌రూట్. ఈ రెండిటిలో అధిక‌ పోషకాల నిల్వలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ఈ రెండు జ్యూస్‌ల మిశ్రమాన్ని తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయాన్నే ఉసిరికాయ, బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉసిరి, బీట్‌రూట్ శరీరానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం..

ఉసిరి ప్రయోజనాలు

1. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

2. ఉసిరి జీర్ణ ఎంజైమ్‌లను ప్రోత్సహిస్తుంది.. దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

3. ఉసిరిలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

4. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి బరువును తగ్గించడంలో సహాయపడతాయి.

5. ఉసిరి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

బీట్‌రూట్ ప్రయోజనాలు

1. బీట్‌రూట్‌లో నైట్రేట్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది.

2. బీట్‌రూట్‌లో శరీరానికి అవసరమైన ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.

3. బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

4. బీట్‌రూట్‌లో ఎనర్జీ లెవల్స్‌ను పెంచే బీటైన్ ఉంటుంది.

5. బీట్‌రూట్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

ఉసిరి - బీట్‌రూట్ రసం కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

న్యూట్రిషన్ పవర్‌హౌస్ : ఉసిరి-బీట్‌రూట్ రెండింటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వాటి రసాన్ని కలిపి తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

రోగనిరోధక వ్యవస్థకై : ఉసిరి-బీట్‌రూట్ రెండూ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఈ జ్యూస్ ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుకు : ఉసిరి-బీట్‌రూట్ రెండూ జీర్ణక్రియకు సహాయపడతాయి, కాబట్టి వాటి రసాన్ని కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

రక్తపోటును నియంత్రణ‌కు : ఉసిరి-బీట్‌రూట్ రెండూ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి, కాబట్టి వాటి రసాన్ని కలిపి తాగడం వల్ల రక్తపోటుకు సంబంధించిన సమస్యలను నివారించవచ్చు.

శక్తి కోసం : ఉసిరి-బీట్‌రూట్ రెండూ శక్తి స్థాయిని పెంచుతాయి. కాబట్టి వాటి రసాన్ని కలిపి తాగడం వల్ల అలసట, బలహీనత నుండి ఉపశమనం లభిస్తుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story