ముందు తరం వారికి చద్దన్నం(Probiotic rice) రుచి ఏమిటో, ఆ ఫుడ్డు వల్ల కలిగే ప్రయోజనమేమిటో తెలుసు. అందుకే చద్దన్నాన్ని ఇష్టంగా తినేవారు. ఈ తరం వారికి చద్దన్నం గురించి పెద్దగా తెలియదు.

ముందు తరం వారికి చద్దన్నం(Probiotic rice) రుచి ఏమిటో, ఆ ఫుడ్డు వల్ల కలిగే ప్రయోజనమేమిటో తెలుసు. అందుకే చద్దన్నాన్ని ఇష్టంగా తినేవారు. ఈ తరం వారికి చద్దన్నం గురించి పెద్దగా తెలియదు. పైగా ఆ మాట వింటేనే మొహం అదోలా పెడతారు. కాని ఇప్పుడు కొన్ని హోటల్స్‌లో, అమెరికా(America) వంటి దేశాలలో చద్దన్నం క్రేజ్‌గా మారింది. అసలు చద్దన్నం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో(Benefits) తెలుసుకుంటే ఈ తరం వారు కూడా మోజు పెంచుకుంటారు. ఇక దాన్ని వదలరంటే వదలరు. రాత్రి మిగిలిన అన్నాన్ని(Left over rice) పొద్దున్న తినడం మామూలే! చాలా మంది రాత్రికి మిగిలేలా అన్నం వండుకుని మరుసటి ఉదయాన్ని చద్దనం తింటుంటారు. ఇటీవ‌ల‌ అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ అధ్యయ‌నంలో(American Nutrition association research) చద్దన్నం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో స్పష్టమయ్యింది. అన్నం పులిస్తే(Fermentation) ఐరన్, పొటాషియమ్‌, కాల్షియం లాంటి సూక్ష్మ పోషకాల(vitamins) స్థాయి పెరుగుతుందని, అందుకే చ‌ద్దన్నంలో ఆ పోష‌కాల పాళ్లు ఎక్కువ‌గా ఉంటాయని ఆ అధ్యయనం చెబుతోంది. రాత్రి వండిన అన్నంలో వంద గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. అది తెల్లారేసరికి 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. బీ6, బీ12 విటమిన్లు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. చ‌ద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్‌గా అయ్యేది అందుకే! అంతేనా... చద్దన్నంతో శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా ల‌భిస్తుంది. ఒంట్లో వేడి చేయడం కార‌ణంగా మన బాడీలో కలిగే దుష్ఫలితాలను చద్దన్నం తగ్గిస్తుంది. తరచూ చద్దన్నం తినడంవల్ల ఫైబర్‌ కంటెంట్ పెరిగి మల బద్దకం, నీరసం లాంటి సమస్యలు మటుమాయం అవుతాయి. బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఫలితంగా ఆందోళన దూరం అవుతుంది. శ‌రీరం ఎక్కువ‌సేపు ఉల్లాసంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఒంట్లో ఉన్న అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే త‌గ్గిపోతాయి. చద్దన్నమనేది ఎదిగే పిల్లల‌కు మంచి పౌష్టికాహారమని అధ్యయనం చెబుతున్నది. చద్దన్నం తినడం వల్ల లావుగా ఉన్నవారు సన్నబడతారు. సన్నగా ఉన్నవారు లావు అవుతారు. లావు తగ్గాలంటే రాత్రి మిగిలిన అన్నాన్ని రాత్రే మజ్జిగలో నానపెట్టుకోవాలి. ఉదయాన్ని అది తినాలి. రోజూ ఇలా తినడం వల్ల లావుగా ఉన్నవారు సన్నబడతారు. రాత్రి మిగిలిన అన్నంలో పాలు పోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటారు కొందరు. ఉదయానికి అది తోడన్నంలా తయారవుతుంది. రోజూ ఈ తోడన్నం తింటే సన్నగా ఉన్నవారు కాసింత లావు అవుతారు. తోడన్నంలో కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, క్యారెట్‌ వంటివి కలుపుకి పోపు చేసుకుని తింటే మహా రుచిగా ఉంటుంది. ఇక అసలు విషయమేమిటంటే ఇలా చేసి పెట్టుకున్న చద్దన్నాన్ని ఉదయాన్నే మస్టుగా తినాలి. ఆలస్యం అవుతే అది పులిసి విషతుల్యంగా మారే ప్రమాదం ఉంది. ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి.

Eha Tv

Eha Tv

Next Story