Corona FLiRT Varient : ఈ కరోనా పాడుగాను.. ఎప్పటికీ వదలదా.. అమెరికాలో బయటపడ్డ మరో వేరియెంట్
అమెరికాలో(America) కొత్త కరోనా వేరియెంట్‌లు(Corona Varient) బయటపడ్డాయి. దీని పేరును ఫ్లర్ట్ ("FLiRT")గా నిర్ధారించారు. ఇందులో కేపీ.2, ఒమిక్రాన్ వేరియెంట్(Omicron varient) యొక్క జెఎన్.1(JN1) అనే సబ్‌వేరియెంట్ కూడా ఉంది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా నాలుగు ఇన్ఫెక్షన్‌లలో KP.2 ఒకటి ఉంది.
అమెరికాలో(America) కొత్త కరోనా వేరియెంట్‌లు(Corona Varient) బయటపడ్డాయి. దీని పేరును ఫ్లర్ట్ ("FLiRT")గా నిర్ధారించారు. ఇందులో కేపీ.2, ఒమిక్రాన్ వేరియెంట్(Omicron varient) యొక్క జెఎన్.1(JN1) అనే సబ్‌వేరియెంట్ కూడా ఉంది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా నాలుగు ఇన్ఫెక్షన్‌లలో KP.2 ఒకటి ఉంది. ఇతర FLiRT వేరియంట్ KP.1.1, USలో విస్తరిస్తోంది కానీ KP.2 కంటే తక్కువ విస్తృతంగా ఉంది.FLiRT వైవిధ్యాలు JN.1.11.1 యొక్క స్పిన్‌ఆఫ్‌లు. అవి ఓమిక్రాన్ వేరియంట్‌లో ఒక భాగం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వేరియెంట్ విస్తృతిపై నిశితంగా పరిశీలించాలని ఆదేశించింది. అయితే ఇది అమెరికా, లండన్, న్యూజిలాండ్, సౌత్ కొరియాలో ఈ వేరియెంట్ కేసులు బయటపడతున్నాయని.. మన దేశం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని సి.కె.బిర్లా ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ రాజీవ్ గుప్తా తెలిపారు. ఈ వేరియెంట్ లక్షణాలు ఉన్నవారికి గొంతు నొప్పి, దగ్గు, అలసట, ముక్కు కారటం, తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, రుచి మరియు వాసన కోల్పోవడం వంటి ఇతర ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌ల మాదిరిగానే కొత్త వేరియంట్ యొక్క లక్షణాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడుక్కోవడం లేదా హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించడం, రద్దీగా ఉండే ప్రాంతాల్లో, ఇండోర్‌లో మాస్క్‌లు ధరించడం, ఇతరుల నుంచి భౌతిక దూరం పాటించడం, భారీ సమావేశాలకు దూరంగా ఉండటం మంచిదని చెప్తున్నారు. అనారోగ్యంగా అనిపించినప్పుడు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు.