ఓ పక్క రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న కరోనాతోనే (corona)మానవాళి కకావికలం అవుతుంటే కొత్త కొత్త వైరస్‌లు (virus) పుట్టుకొస్తూ భయాందోళనలు రేపుతున్నాయి. ప్రస్తుతం రష్యాలో (Russia)అంతుబట్టని ఓ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది.

ఓ పక్క రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న కరోనాతోనే (corona)మానవాళి కకావికలం అవుతుంటే కొత్త కొత్త వైరస్‌లు (virus) పుట్టుకొస్తూ భయాందోళనలు రేపుతున్నాయి. ప్రస్తుతం రష్యాలో (Russia)అంతుబట్టని ఓ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ప్రజలు పెద్ద సంఖ్యలో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆసుపత్రులు (Hospital)పేషంట్లతో నిండిపోతున్నాయి. అంబులెన్స్‌లు బిజీ అయ్యాయి. చాలా మంది నిమోనియాతో (pneumonia) అనారోగ్యం బారిన పడ్డారని అధికారులు అంటున్నారు. ఓ హాస్పిటల్‌ ముందు 30 అంబులెన్స్‌లు, మరో ఆసుపత్రి ఎదుట పదికిపైగా అంబులెన్స్‌లు (Ambulance) క్యూ కట్టడం చూస్తుంటే పరిస్థితి ఎంత విషమంగా ఉన్నదో అర్థమవుతున్నది. అయితే తాజా పరిస్థితి తెలిపేందుకు ప్రభుత్వ అధికారులు నిరాకరిస్తున్నారు. ఆసుపత్రుల దగ్గర అంబులెన్స్‌లు క్యూ కట్టడమన్నది సర్వసాధారణ విషయమేనని అంటున్నారు.

Updated On 20 Dec 2023 12:00 AM GMT
Ehatv

Ehatv

Next Story