మిరియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. మిరియాలు తీసుకుంటే.. కీళ్ల నొప్పులు, పేగులలో మంట తగ్గుతుంది. మిరియాలలో ఉండే.. పైపరైన్ యాంటీఆక్సిడెంట్‌గా పని చేసి.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు, క్యాన్సర్, ఆస్తమా, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మిరియాలు అంటే తెలియని వారు ఉండరు .... ఈ మిరియాలు ( Black Pepper) రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. మిరియాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలా వాడాలో తెలుసుకుందాం.
మిరియాలను మసాలాల్లో రారాజు (King of spices) అని పిలుస్తారు. వ్యాధులను నయం చేయడానికి మిరియాలను ఆయుర్వేదంలో ఔషదంలా వాడతారు. మిరియాలు క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను నుంచి రక్షిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ పెప్పరైన్ శ్వాసను నియంత్రించి మెదడు పనితీరుని చురుగ్గా ఉంచుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవే మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. మిరియాలులో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది. గాయాలు నయం చేయడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీనిలో విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6, థయామిన్, నియాసిన్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియలో గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. మిరియాలు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసాన్ని తగ్గించడానికి మిరియాలు గొప్పగా పని చేస్తాయి. మిరియాలు కాలేయాన్ని శుద్ధిచేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్యాటీలివర్‌ని అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా మిరియాలు పేగులను శుభ్రపరిచి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి. పొట్ట, పేగుల్లోని అదనపు గాలిని తొలగిస్తాయి. మిరియాలలో ఉండే.. అనోరెక్సియా టేస్ట్ బడ్స్‌ను ఉత్తేజితం చేస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. మిరియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. మిరియాలు తీసుకుంటే.. కీళ్ల నొప్పులు, పేగులలో మంట తగ్గుతుంది. మిరియాలలో ఉండే.. పైపరైన్ యాంటీఆక్సిడెంట్‌గా పని చేసి.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు, క్యాన్సర్, ఆస్తమా, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలర్జీలు, సైనసైటిస్‌లకు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్‌ను నివారించడానికి, పోరాడటానికి కూడా మిరియాలు ఎంతో సహాయపడతాయి.
ప్రతిరోజూ ఒక నల్ల మిరియం తింటే చాలు లేదా వంటలలో ఏదో ఒక రకంగా వాడిన చాలు...మంచి రిజల్ట్స్ రావడానికి ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక నల్ల మిరియం తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే హార్మోన్ల అసమతుల్యత, డయాబెటిస్, అమినోరియా, నెలసరి సమస్యలు దూరమవుతాయి. నల్ల మిరియాలను ( Black Pepper )పసుపు, తేనెలో కలుపుకుని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని, శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయని అన్నారు. అంతేకాదు నిద్రపోయే ముందు కొంచెం మిరియాల పొడి, శొంఠి పొడి, వేడి పాలల్లో వేసుకుని తాగితే.. నిద్రలేమి సమస్య దూరమవుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో మిరియాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసుకున్నాం కదా ఇంకా ఆలస్యం చేయకుండా డైట్ లో చేర్చుకుంటే మంచిది.