చాయ్ లో చ‌క్కెర బ‌దులు బెల్లం వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, పంచదారతో పోలిస్తే దీని వల్ల కలిగే నష్టం చాలా తక్కువ శాతంగా ఉంటుంది.

చాయ్ ..ఈ మాట వినగానే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.. జీవితంలో చాయ్ ఓ భాగమైపోయింది. నిద్ర లేవగానే ఓ కప్పు చాయ్ కడుపులో పడితే గాని ఏ పని చేయలేం.. ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్న ఒ కప్పు చాయ్ కావాల్సిందే .చాయ్ కు అంత క్రేజీ ఉందన్న మాట . అందులో ఇరానీ ఛాయ్ గురించి చెప్పే పని లేదు . అయితే ఈ చాయ్ లో ఇరానీ చాయ్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు .. ఈ చాయ్ లో మసాల చాయ్ , అల్లం టీ వంటి చాలా వైరైటీస్ ఉన్న దేని రుచి దానిదే . అయితే చాలామందికి గంటకొకసారి టీ తాగకపోతే వారికి రోజు గడవదు. ఇలా రోజుకు ఎన్నోసార్లు టీ తాగుతూ ఉంటారు. ఇలా ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల అందులో ఉన్న చెక్కర శాతం క్యాలరీలను మన శరీరంలోకి వెళ్ళేలా చేస్తాయి. మన శరీరంలో కేలరీలు అధికంగా ఉండటం వల్ల శరీర బరువు గణనీయంగా పెరుగుతారు. అధిక బరువు పెరగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి. అయితే టీ లో చెక్కర కు బదులుగా బెల్లం వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

పంచదారకి ప్రత్యామ్నాయమే బెల్లం. చాయ్ లో చ‌క్కెర బ‌దులు బెల్లం వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, పంచదారతో పోలిస్తే దీని వల్ల కలిగే నష్టం చాలా తక్కువ శాతంగా ఉంటుంది. బెల్లం లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణ క్రియలో ఏర్పడే అజీర్తి వంటి సమస్యలన్నింటికీ కూడా బెల్లం మంచి పరిష్కారం. . బెల్లం లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. టీ లో బెల్లం వేసుకొని తాగడం ద్వారా మన శరీరంలో జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. బెల్లం టీ అధికశాతం ఐరన్ మన శరీరానికి అందటం వల్ల రక్తహీనత వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా రక్తం సరఫరా సమృద్ధిగా జరిగి, అధిక రక్తపోటు నుంచి మనల్ని కాపాడుతుంది.

మీరు పదే పదే అలసిపోయినట్లు అనిపిస్తే, బెల్లం టీ తాగండి, ఇది అలసట నుండి ఉపశమనం పొందుతుంది. ఈ టీ శక్తిని అందిస్తుంది మరియు వివిధ లోపాలను తొలగిస్తుంది. బెల్లం‌లో కాల్షియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా బెల్లం టీ తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. ఈ బెల్లం టీ లో బెల్లం తో పాటు కొద్దిగా అల్లం, మిరియాలు వేసుకొని తాగడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే వ్యాధులతో పోరాడటానికి రోగనిరోధక శక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే టీలో బెల్లంతో పాటు కాసింత అల్లం, మిరియాలు కూడా వేసుకొని తాగితే.శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.దాంతో సీజ‌న‌ల్‌గా వ‌చ్చే రోగాలకు దూరంగా ఉండొచ్చు.

Updated On 11 March 2023 5:12 AM GMT
Ehatv

Ehatv

Next Story