ప్రతిరోజూ నీరు(Water) ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. రోజుకు కనీసం నాలుగు లీటర్ల వరకు నీటిని తాగాలని.. అయితే మొత్తం ఒకేసారి కాకుండా.. కొద్ది కొద్దిగా తీసుకోవాలని అంటారు. ఇక ఇప్పుడు వేసవిలో నీళ్లు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచింది. అయితే కొందరికి ఎన్ని నీళ్లు తాగిన దాహం(Thirsty) తీరినట్టుగా అనిపించదు. మళ్లీ మళ్లీ నీళ్లు తాగాలనిపిస్తుంటుంది.

ప్రతిరోజూ నీరు(Water) ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. రోజుకు కనీసం నాలుగు లీటర్ల వరకు నీటిని తాగాలని.. అయితే మొత్తం ఒకేసారి కాకుండా.. కొద్ది కొద్దిగా తీసుకోవాలని అంటారు. ఇక ఇప్పుడు వేసవిలో నీళ్లు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచింది. అయితే కొందరికి ఎన్ని నీళ్లు తాగిన దాహం(Thirsty) తీరినట్టుగా అనిపించదు. మళ్లీ మళ్లీ నీళ్లు తాగాలనిపిస్తుంటుంది. అలా రోజుకు ఎన్ని సార్లు వాటర్ తాగినా... వారికి మళ్లీ దాహంగానే ఉంటుంది. కానీ ఇలాంటి సంకేతాలు మధుమేహం(diabetes), రక్తహీనత(anemia) వంటి వ్యాధులను సూచిస్తాయి. ఇలాంటి సమస్య రెండు వారాల పాటు ఉంటే అనారోగ్య సమస్యలు ఉన్నట్టే. కన్నౌజ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కైలాష్ సోనీ(Kailash Sony) కొన్ని సూచనలు తెలిపారు. ప్రతిసారి దాహంగా అనిపించడాన్ని తేలిగ్గా తీసుకోవద్దని.. అలాగే ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఈ అనారోగ్య సమస్యలు వస్తాయని అంటారు.

ఈ 5 కారణాల వల్ల ఎక్కువ దాహం వేస్తుంది

నోరు పొడిబారడం: అధికంగా దాహం వేయడానికి ప్రధాన కారణం నోరు పొడిబారడం(Dried Throat). లాలాజల గ్రంథులు తగినంత లాలాజలాన్ని ఉత్పత్తి చేయనప్పుడు, అలాగే నోరు తగినంత తేమగా లేనప్పుడు ఈ సమస్య వస్తుంది. దీని వల్ల నోరు, గొంతు, నాలుక పొడిబారతాయి. అదే సమయంలో పెదవులు కూడా పగుళ్లు ఏర్పడతాయి.

మధుమేహం: అధిక దాహం కూడా మధుమేహానికి(diabetes) కారణం కావచ్చు. మూత్రపిండాలు రక్తం నుండి ఎక్కువగ షుగర్ లెవల్స్ తీసుకున్నప్పుడు.. అప్పుడు గ్లూకోజ్ మూత్రం ద్వారా బయటకు రావడం జరుగుతుంది. దీంతో మీరు రోజులో అనేకసార్లు టాయిలెట్ వెళ్లాల్సి వస్తుంది. అధిక మూత్రవిసర్జన వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దాహం ఎక్కువ కావడానికి ఇదే కారణం.

అజీర్ణం(indigestion): అధిక దాహం జీర్ణవ్యవస్థ ప్రభావం చూపిస్తుంది. చాలా సార్లు స్పైసీ ఫుడ్ సులభంగా జీర్ణం కాదు. ఇది జీర్ణం కావడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరం. దీని వల్ల మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది.

విపరీతమైన చెమట(Excessive Sweat): తరచుగా దాహం వేయడానికి విపరీతమైన చెమట కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. వేసవిలో శరీరం నుండి చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాగే మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది.

రక్తహీనత(Anemia): ఎక్కువగా దాహంగా ఉండడం రక్తహీనతకు సంకేతం. శరీరం ఎర్ర రక్త కణాలను తగినంత పరిమాణంలో ఉత్పత్తి చేయలేనప్పుడు క్రమంగా ఎర్ర రక్త కణాల కొరత ఏర్పడుతుంది. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. దీంతో అలసట లేదా పల్స్ పెరగడం.. లేదా కండరాల తిమ్మిరి కలుగుతుంది.

Updated On 15 Jun 2023 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story