AI Can Predict Lung Disease:ఏఐతో ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు ముందే కనిపెట్టొచ్చు..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో మూత్ర పరీక్షల వల్ల దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడతారని ఏడు రోజుల ముందు మంట వచ్చే అవకాశం ఉందని అంచనా వేయగలుగుతామని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ సాంకేతికతతో ఆస్పత్రికి వెళ్లకుండానే రోగం నిర్ధారణ చేసుకొని జాగ్రత్తలు తీసుకోవచ్చని చెప్తున్నారు. దీంతో ఇంట్లోనే తమ మూత్ర పరీక్షలు చేసుకొని మొబైల్ ద్వారా నిపుణులను సంప్రదించే అవకాశం ఉందంటున్నారు. దీర్ఘకాలిక అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) ఉన్న 55 మంది రోగుల ముత్రాన్ని పరీక్షించారు. లక్షణాలు తీవ్రమవుతున్నప్పుడు కణాలు ఎలా అభివృద్ధి అవుతున్నాయనేది గుర్తించారు. ఈ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రత వచ్చే ముందే గుర్తించి దానిని అరికట్టడం లేదా దానిని నివారించేందుకు సహాయపడతాయంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలో గురక, నిరంతర దగ్గు లక్షణాలు ఉన్నవారు ఊపరితిత్తుల వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. లక్షణాలు ప్రారంభమయ్యే ఏడు రోజుల ముందే AIతో మూత్రం నమూనాలను పరిశీలించి ఖచ్చితంగా అంచనా వేయగలదని అధ్యయనం తెలిపింది.