Sugar Test: చెమటతో షుగర్ టెస్ట్ చేసే పరికరాన్ని కనిపెట్టిన తెలుగు సైంటిస్ట్..!
సాధారణంగా రక్తం (Blood)తో షుగర్ టెస్టులు చేస్తుంటారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్(FBS), రాండం బ్లడ్ షుగర్ (RBS) అనే టెస్టులు రక్తంపై ఆధారపడే చేస్తుంటారు. కానీ ఓ తెలుగు సైంటిస్ట్ చెమటతో మధుమేహాన్ని పరీక్షించే ఓ పరికరాన్ని కనుగొన్నాడు. దీనిపై పేటెంట్‌ను కూడా పొందాడు.
సాధారణంగా రక్తం (Blood)తో షుగర్ టెస్టులు చేస్తుంటారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్(FBS), రాండం బ్లడ్ షుగర్ (RBS) అనే టెస్టులు రక్తంపై ఆధారపడే చేస్తుంటారు. కానీ ఓ తెలుగు సైంటిస్ట్ చెమటతో మధుమేహాన్ని పరీక్షించే ఓ పరికరాన్ని కనుగొన్నాడు. దీనిపై పేటెంట్‌ను కూడా పొందాడు. ఐఐటీ కాన్పూర్‌లో (IIT Kanpur) సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఏలూరు (Eluru)కు చెందిన శ్రీనివాస్‌రావు (Srinivas Rao) ఎలక్ట్రో కెమికల్ (Electro Chemical) పరికరాన్ని కనిపెట్టాడు. రక్తం అవసరం లేకుండా చమటను పరీక్షించి నిమిషంలోనే షుగర్ టెస్ట్ ఫలితాలను ఈ పరికరం వెల్లడిస్తుంది. దీని కోసం దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ పరికరం పనితీరును రెండేళ్ల పాటు పరిశీలించిన ఇండియన్ పేటెంట్ అథారిటీ (Indian Patent Authority) ఈ మధ్యనే శ్రీనివాస్‌రావుకు పేటెంట్ కల్పించింది. జీవ, రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ (PHD) పూర్తి చేసుకున్న శ్రీనివాస్‌రావు ఐఐటీ కాన్పూర్‌లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు