మంకీ పాక్స్‌తోనే(M-Pox) జనాలు గజగజమని వణికిపోతుంటే ఇప్పుడు మరో వైరస్ భయకంపితులను చేస్తున్నది.
మంకీ పాక్స్‌తోనే(M-Pox) జనాలు గజగజమని వణికిపోతుంటే ఇప్పుడు మరో వైరస్ భయకంపితులను చేస్తున్నది. పాకిస్తాన్‌లో(Pakistan) వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ మన దేశానికి సోకే ప్రమాదం ఉంది. అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన సీసీహెచ్‌ఎఫ్ (Crimean Congo hemorrhagic fever) ఆల్‌రెడీ పాకిస్తాన్‌లో జొరపడింది. దీనికి ఐ బ్లీడింగ్ వైరస్(Eye-Bleeding Virus) అని కూడా అంటారు. ఈ వైరస్ సోకితే కంటి నంచి రక్తం కారుతుంది. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. పాకిస్తాన్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడి కంటి నుంచి ఏకధాటిగా రక్తం కారుతోంది. ప్రస్తుతం ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఇది వెలుగులోకి రావడంతో పాకిస్తాన్ అప్రమత్తమయ్యింది. ఐ బ్లీడింగ్ వైరస్ లేదా క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ నివారించడం చాలాకష్టమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చికిత్స కూడా అంత సులభమేమీ కాదని అంటోంఇ. ఐ బ్లీడింగ్ వైరస్ తొలిసారిగా 1944లో క్రిమియన్ ద్వీపకల్పంలో కనిపించింది. 1956లో కాంగో బేసిన్‌లో ఈ వ్యాధికి సంబంధించిన పలు కేసులు కనిపించాయి. క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ సోకిన వారిలోని 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. పేనులా ఇది కూడా పర్నాజీవినే! దీని కాటు ద్వారా ఈ వైరస్ వృద్ధి చెందుతుంది.
సీసీహెచ్‌ఎఫ్ వైరస్ సోకిన వ్యక్తిలో పెద్దగా లక్షణాలేమీ కనిపించవు. తర్వాత అధిక జ్వరం, కండరాల నొప్పి, కడుపు నొప్పి, కళ్ల నుంచి రక్తం కారడం, అవయవ వైఫల్యం, తల తిరగడం, వాంతుల రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మహా డేంజర్. దీనికి ఎలాంటి చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాదేలు. రోగులను క్వారంటైన్‌లో ఉంచి, వ్యాధి లక్షణాలను డాక్టర్లు తొలగించే ప్రయత్నం చేస్తారు. సీసీహెచ్‌ఎఫ్ సోకినవారిలో సగానికి సగానికి సగం మంది చనిపోతున్నారు. ఈ వ్యాధికి దూరంగా ఉండాలంటే వ్యాధి నివారణ ఒక్కటే మార్గం.