తెలంగాణలో(Telangana) 9 నెలల చిన్నారికి కరోనా(Corona) నిర్ధారణ అయింది. జలుబు(Cold), దగ్గు(Cough), జ్వరంతో(Fever) బాధపడుతూ నిలోఫర్‌కు(Nilofer) వచ్చిన 17 మంది చిన్నారులకు కరోనా టెస్టులు నిర్వహించగా ఓ చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
తెలంగాణలో(Telangana) 9 నెలల చిన్నారికి కరోనా(Corona) నిర్ధారణ అయింది. జలుబు(Cold), దగ్గు(Cough), జ్వరంతో(Fever) బాధపడుతూ నిలోఫర్‌కు(Nilofer) వచ్చిన 17 మంది చిన్నారులకు కరోనా టెస్టులు నిర్వహించగా ఓ చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చౌటుప్పల్‌కు(Chatuppal) చెందిన 9 నెలల పాపకు కరోనా నమోదుకావడంతో నిలోఫర్‌లో ఈ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. మంచిర్యాలలో ఒకరికి కరోనా సోకగా, మహబూబాబాద్ జిల్లా మర్రిమిట్టలో ఓ విద్యార్థినికి కరోనా సోకింది. చలి తీవ్రత పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ జలుబు, దగ్గు ఉంటే ఆందోళన అక్కర్లేదన్న వైద్యులు, మూడు రోజులైనా జ్వరం తగ్గకపోతే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.