మనిషికి రకరకాల అలవాట్లు ఉంటాయి. అయితే అందరి అలవాట్లు ఒకేలా ఉండవు. అందులో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండొచ్చు..
మనిషికి రకరకాల అలవాట్లు ఉంటాయి. అయితే అందరి అలవాట్లు ఒకేలా ఉండవు. అందులో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండొచ్చు.. అనారోగ్యకరమైన అలవాట్లు ఉండొచ్చు. ఈరకంగా చూసుకుంటే ప్రతీ మనిషి ఖాళీకడుపుతో తినకూడని పదార్ధాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటో తెలుసా..?
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా తాగడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఉదయం నిద్ర లేవగానే బెడ్ మీదనే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగితే కడుపులో యాసిడ్ సమస్య పెరుగుతుందంటున్నారు. ఇలా జరగడం వల్ల పొట్ట పెరిగే అవకావం ఎక్కువ అవుతునంది. అది కూడా జీర్ణక్రియ సమస్యల వల్ల ఈ విదమైన పరిస్థితి ఏర్పడుతుందని సమాచారం. ఇది కార్టిసాల్ స్థాయిని పెంచి ఒత్తిడికి గురి చేస్తుంది.
ఇక చాలామంది కూల్ డ్రింక్స్ కు బానిసలుగా మారుతుంటారు. రోజు ఏదో ఒక టైమ్ లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స తాగే అలవాటు కలిగి ఉంటారు. అయితే అందులో కొంత మంది మాత్రం ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. కాని ఆ అలవాటు ఉంటే వెంటనే మానేయాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది కూడా సమ్మర్ లో.. కూల్ డ్రింక్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉండే సమ్మర్ లోనే ఇవి తాగడం మంచిది కాదట. ఈ విషయంలో వాటర్ తాగితే మంచిది కాని కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు అంటున్నారు. ఉదయాన్ని ఇలా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో శక్తి పోతుందంటున్నారు.
ఉదయాన్ని తినకూడని మరో పదార్ధం పెరుగు. ఇది ఆరోగ్యానికి మంచిదే.. కాని ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తినకూడదు. అలా తినడం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. అలా మంచి బ్యాక్టీరియా నశించడం వల్ల అసిడిటీ పెరిగి.. అరుగుదల దబ్బతింటుంది. దానితో గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది అని నిపుణులు అంటున్నారు.
ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో స్పైసీ ఫుడ్ తినకూడదు. లేదంటే కడుపునొప్పి వస్తుంది. అంతే కాకుండా కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అంటే మీరు అజీర్ణం మరియు అసిడిటీ వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది కాకుండా, మీరు ఉదయం ఖాళీ కడుపుతో స్పైసీ ఫుడ్స్ తినడం మానుకోవాలి.
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఈ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వీటిని ఖాళీ కడుపుతో తింటే, పొట్టలో ఎక్సెస్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది, దీని వల్ల శరీరం రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది.
అంతే కాదు ఖాళీ కడుపుతో స్వీట్స్ కూడా తినకూడదు.. దాని వల్ల శరీరంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. ఇక కూరగాయలు, ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి మంచిదని ఖాళీ కడుపుతో లాగిస్తుంటారు కొందరు. కాని అది కూడా మంచిది కాదు. దాని వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి.