జాంబియా(Zambia) నుంచి వచ్చిన 14 ఏళ్ల అబ్బాయికి అరుదైన చికిత్సను విజయవంతంగా చేశారు కిమ్స్(KIMS) వైద్యులు. తమ దేశంలో వైద్య సదుపాయాలు సరిగా లేక, తమ కుమారుడికి వచ్చిన వ్యాధి గుర్తించలేకపోయిన జాంబియా దంపతులు సముద్రాలు దాటి హైదరాబాద్ కిమ్స్‌కు తీసుకొచ్చారు.
జాంబియా(Zambia) నుంచి వచ్చిన 14 ఏళ్ల అబ్బాయికి అరుదైన చికిత్సను విజయవంతంగా చేశారు కిమ్స్(KIMS) వైద్యులు. తమ దేశంలో వైద్య సదుపాయాలు సరిగా లేక, తమ కుమారుడికి వచ్చిన వ్యాధి గుర్తించలేకపోయిన జాంబియా దంపతులు సముద్రాలు దాటి హైదరాబాద్ కిమ్స్‌కు తీసుకొచ్చారు. తరుచుగా కీళ్ల నొప్పి, నీరసం రావడం, హిమోగ్లోబిన్(Himoglobin) శాతం తగ్గిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న బాలుడికి హెమటో ఆంకాలజిస్ట్, మూలుగ మార్పిడి నిపుణుడు డాక్టర్ నరేంద్ర కుమార్(Narendra Kumar) తోట పరీక్షలు చేయగా అతను సికిల్‌సెల్ వ్యాధితో బాధపడుతున్నారని తేలింది. ఈ సమస్యతో బాధపడుతున్నవారికి ఆరోగ్యకరమైన మూలకణాలను ఇతరుల నుంచి సేకరించి ఎక్కించాలని తెలిపారు.
ఆ పేషెంట్ మూలకణాలతో మ్యాచ్ అయ్యేలా ఉంటేనే వాటిని సేకరించగలుగుతారు. అందుకోసం తన అన్నకు మూల కణాలను ఇచ్చేందుకు ఏడేళ్ల బాలిక ముందుకొచ్చింది. తాను కూడా సికిల్‌సెల్‌తో బాధపడుతున్నప్పటికీ, తీవ్రత తన అన్న అంతగా లేకపోవడంతో డాక్టర్లు..ఆ చిన్నారి మూలకణాలను(stem cells) ఎక్కించేందుకు అంగీకరించారు. బాలుడి మూలకణాలతో చిన్నారి మూల కణాలు మ్యాచ్ కావడంతో ఆమె మూలకణాలను ఎక్కించారు. దీని ద్వారా 100 శాతం సమస్య తగ్గనప్పటికీ ఇకపై ఈ వ్యాధి నుంచి బాలుడికి విముక్తి లభిస్తుందని వైద్యులు తెలిపారు. సికెల్‌సెల్ వ్యాధితో(Sickle cell disease) బాలుడికి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రావని వైద్యులు వెల్లడించారు. అన్నా, చెల్లి ఇద్దరూ సురక్షితంగానే ఉంటారని వైద్యులు అన్నారు. ఈ సికెల్‌సెల్ వ్యాధితో బాధపడుతున్నవారికి మూలుగుకణాలను ఎక్కిస్తే నయమవుతుందని చాలా మందికి తెలియదని వైద్యులు అన్నారు.