నేటి బిజీ లైఫ్ కార‌ణంగా ఎన్నో ర‌కాలుగా ప్ర‌జ‌లు అనారోగ్యం పాల‌వుతున్నారు. ఇందుకు ఆహ‌ర ప‌దార్ధాలు కూడా ఓ కార‌ణం.

నేటి బిజీ లైఫ్ కార‌ణంగా ఎన్నో ర‌కాలుగా ప్ర‌జ‌లు అనారోగ్యం పాల‌వుతున్నారు. ఇందుకు ఆహ‌ర ప‌దార్ధాలు కూడా ఓ కార‌ణం. స్పైసీ ఆహారపదార్థాలు తినడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల ఎంతో మంది బరువు పెరుగుతున్నారు. అలాగే శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఊబకాయానికి గురవుతున్నారు. అధిక బరువు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. బిజీ కార‌ణంగా ప్రజలు సరైన వర్కవుట్ చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితితుల‌లో మీ రోజువారీ ఆహారంలో కొన్ని కూరగాయలను చేర్చుకుంటే.. మీ పొట్టను తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ కూరగాయలలో ఐరన్, ఫైబర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఆ కూరగాయల గురించి తెలుసుకుందాం.

బీన్స్

బీన్స్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది వాపుతో పోరాడుతుంది. బొడ్డు చుట్టు కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. దీంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉండేలా సహాయపడుతుంది. అందువల్ల మీ రోజువారీ ఆహారంలో బీన్స్ చేర్చుకోండి.

ఆస్పరాగస్

ఆకుకూర జాతికి చెందిన ఆస్పరాగస్ ను పిల్లితేగ లేదా తోటతేగ లేదా పిచ్చుకతేగ అని పిలుస్తారు. దీనిలో జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, రాగి వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉండే తక్కువ కేలరీల కూరగాయ. ఇది కరిగే, కరగని ఫైబర్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. అంతేకాకుండా ఇది జీర్ణక్రియకు స‌హాయ‌ప‌డుతుంది.

బ్రోకలీ

యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండే బ్రకోలీని తినడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి.. ఇవి పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

క్యారెట్

క్యారెట్లు కంటి చూపును మాత్రమే కాకుండా.. మీ పొట్ట కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. తక్కువ కేలరీల క్యారెట్‌లలో మంచి మొత్తంలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

కాకరకాయ

కాకరకాయ రుచిలో చేదుగా ఉండవచ్చు.. కానీ పొట్టలోని కొవ్వును తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఇన్సులిన్ మొత్తాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story