రక్తం ఎప్పుడైతే మందంగా మారుతుందో అప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, గుండె సమస్యలు.

రక్తం ఎప్పుడైతే మందంగా మారుతుందో అప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, గుండె సమస్యలు. ఈ సమస్య నుంచి నేచురల్‌గానే ఎలా బయటపడాలో చూద్దాం.శరీరానికి రక్తం చాలా ముఖ్యం. అన్ని భాగాలకు రక్తం పోషకాలను అందిస్తుంది. ఈ రక్తం మరీ చిక్కగా ఉండకూడదు. అలా అని పలుచగా కూడా ఉండకూడదు. అప్పుడే దాని ప్రవాహం సరిగ్గా ఉంటుంది. అయితే, రక్తం కొన్ని కారణాల వల్ల రక్తం చిక్కబడుతుంది. ఎప్పుడైతే, ఇలా జరుగుతుందో గుండె సమస్యలు పెరుగుతాయి. అందుకే గుండె సమస్యలు ఉన్నవారికి రక్తాన్ని పలుచగా చేసేందుకు డాక్టర్స్ కొన్ని మెడిసిన్‌ని సజెస్ట్ చేస్తారు.

బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తాన్ని పలుచగా చేసేవి. గుండె సమస్యలు ఉన్నవారికి డాక్టర్స్ వీటిని సజెస్ట్ చేస్తారు. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు. దీంతో తగినంత రక్తం కూడా అందుతుంది.

అయితే, కొన్ని ఇంటి చిట్కాలతో రక్తాన్ని చిక్కబడకుండా కాపాడుకోవచ్చని ఆయుర్వేద డాక్టర్ మిహీర్ ఖత్రీ చెబుతున్నారు.నేడు గుండె సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సమస్య గురించి కచ్చితమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా ఈ సమస్య లక్షణాల గురించి కూడా ఆలోచించాలి. అవి.

ఛాతీలో నొప్పి,ఛాతీలో ఇబ్బంది,మెడ నొప్పి,దవడ, గొంతు నొప్పి,వెన్ను నొప్పిచేతులు, కాళ్ళలో తిమ్మిరి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.రక్తాన్ని పలుచగా చేసేందుకు..ఆయుర్వేద డాక్టర్ మిహీర్ ఖత్రి ప్రకారం.. పాత బెల్లంని తీసుకోవడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా వెల్లుల్లి.. ఈ రెండింటిని కలిపి తీసుకోవాలి. దీని వల్ల రక్తం పలుచగా అవుతుంది.

ఎలా తీసుకోవాలంటే..ముందుగా అరచెంచా పాత బెల్లం తీసుకోవాలి.ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకోవాలి.రెండింటిని మెత్తగా దంచుకోండి.గ్రైండ్ చేసి చట్నీలా చేయాలి.దీనిని పరగడపున లేదా భోజనానికి ముందు తీసుకోండి.

డయాబెటిస్ ఉంటే..

అయితే, ఈ రెమిడీని షుగర్ ఉన్నవారు తీసుకునే ముందుగా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. వారి కోసం అరచెంచా ఫ్రై చేయని అవిసె గింజలు లేదా అల్లం పొడి, నల్ల మిరియాల 2 గ్రాముల పొడి, ఓ చెంచా నల్ల నువ్వులని తీసుకోమని సలహా ఇస్తారు. అయితే, వైద్యుల సలహాతోనే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.

ఎక్కువగా వద్దు..

అయితే, ఈ ఆయుర్వేద చిట్కాతో శరీరంలో వేడి ఎక్కువ అవుతుందని అందుకే తీసుకునే ముందు డాక్టర్‌ని కలిసి వారి సలహాతోనే తీసుకోవాని చెబుతున్నారు.అదే విధంగా, ఇప్పటికే రక్తం పలుచగా చేసేందుకు మందులు తీసుకునే వారు ముందుగానే డాక్టర్‌కి ఆ విషయం చెప్పి వారి సూచనలు పాటించాలని చెబుతున్నారు.

ehatv

ehatv

Next Story