London: పీరియడ్ నొప్పులు భరించలేక ఆ టాబ్లెట్లు వేసుకుంది...తర్వాత ఏమైంది?
బ్రిటన్‌కు చెందిన పదహారేళ్ల విద్యార్థిని లైలా పిరియడ్ నొప్పిని భరించలేకపోయింది.నొప్పి తగ్గాలంటే గర్భనిరోధక మాత్రలు(Contraceptive pill) వేసుకోవాలని ఆమె ఫ్రెండ్స్ ఓ సలహా ఇచ్చారు. నిజమే కాబోలనుకుని లైలా వారు చెప్పినట్టే నవంబర్ 25వ తేదీ నుంచి ఆ మాత్రలు వేసుకోవడం మొదలు పెట్టింది. ఆ ట్యాబ్లెట్లు వాడుతున్న క్రమంలోనే ఆమెకు విపరీతమైన తలనొప్పి(Headache) మొదలయ్యింది. దీంతో పాటుగానే మరికొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. రానురాను పరిస్థితి విషమించసాగింది.
బ్రిటన్‌కు చెందిన పదహారేళ్ల విద్యార్థిని లైలా పిరియడ్ నొప్పిని భరించలేకపోయింది.నొప్పి తగ్గాలంటే గర్భనిరోధక మాత్రలు(Contraceptive pill) వేసుకోవాలని ఆమె ఫ్రెండ్స్ ఓ సలహా ఇచ్చారు. నిజమే కాబోలనుకుని లైలా వారు చెప్పినట్టే నవంబర్ 25వ తేదీ నుంచి ఆ మాత్రలు వేసుకోవడం మొదలు పెట్టింది. ఆ ట్యాబ్లెట్లు వాడుతున్న క్రమంలోనే ఆమెకు విపరీతమైన తలనొప్పి(Headache) మొదలయ్యింది. దీంతో పాటుగానే మరికొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. రానురాను పరిస్థితి విషమించసాగింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. కడుపు నొప్పి తాళలేక విలవిలాడిపోతుండటం చూసి కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు(Hospital) తీసుకెళ్లారు. మొదట డాక్టర్లు ఆమె కడుపులో ఏదైనా గడ్డ ఉందేమోనని డౌట్ పడ్డారు. సీటీ స్కాన్ తీశారు. అందులో డాక్టర్లకే దిమ్మ తిరిగేలా అసలు విషయం బయటపడింది. కడుపులో సమస్య అనుకుంటే అది బ్రెయిన్‌లోనే ఉండటం డాక్టర్లను ఆశ్చర్యపర్చడమే కాదు, కలవరపాటుకు గురి చేసింది. ఆమె మెదడులో వేగంగా రక్తం గడ్డకడుతుండడాన్ని (Blood clot) చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే డిసెంబర్ 13వ తేదీన ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. అయినా లాభం లేకుండాపోయింది. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆమె చనిపోయింది. మహిళలకు రుతుక్రమం(Periods) సమయంలో కడుపునొప్పి రావడం సహజం. కొందరికి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి రెండు రోజులు భయంకరమైన నొప్పి ఉంటుంది. రెండు రోజుల తర్వాత ఉపశమనం దొరుకుతుంది. ఆ సమయంలో నొప్పి తట్టుకోలేక మందులను వాడుతుంటారు. ఇది చాలా తప్పని అంటున్నారు డాక్టర్లు. ఎవరూ ఇలా మాత్రలు వేసుకోవద్దని చెబుతున్నారు. ఒకవేళ ట్యాబ్లెట్లు (Tablets)వేసుకోవాలనుకుంటే ముందు పెద్దవాళ్లకు చెప్పి వేసుకోండని సూచిస్తున్నారు. అందరి శరీరాలు ఒకేలా ఉండవని, మాత్రలు కూడా అందరికీ ఒకేలా రియాక్షన్ ఇవ్వవని చెబుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుని, కుటుంసభ్యులకు ఆవేదన మిగల్చకండి అని వైద్యులు చెబుతున్నారు.