కేరళలో(Kerala) నిపా వైరస్(mipah virus) కలకలం సృష్టిస్తోంది.
కేరళలో(Kerala) నిపా వైరస్(mipah virus) కలకలం సృష్టిస్తోంది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏల్ల బాలుడిని(14 yers teen) నిపా వైరస్ బలి తీసుకుంది. ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్సి తీసుకుంటూ చనిపోయాడు. నిపా వైరస్ సోకిన బాలుడిని వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. వైరస్ సోకిందని గుర్తించిన కొద్ది గంటల్లోనే.. బాలుడు చనిపోవడం భయాందోళనలు కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ నిబంధనల మేరకు బాలుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నిపా వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేరళ ప్రభుత్వం అలెర్టయ్యింది. బాలుడి హై రిస్క్ కాంటాక్టులను ఇప్పటికే గుర్తించి.. వారిని కాపాడేందుకు ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీలను ఆర్డర్ చేసింది. మే 12వ తేదీన వైద్య కోసం ఆ పిల్లోడు ఓ ప్రైవేటు క్లినిక్‌కు వచ్చాడు. మే 15వ తేదీన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.
ఇప్పుడా బాలుడు నిపా వైరస్ సోకి మృతి చెందడంతో ప్రభుత్వం అలెర్టయ్యింది . కాంటాక్టులను గుర్తించే పనిలో పడింది. హై రిస్క్ కాంటాక్టులను వేరు చేశారు. నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పుణేలోని ఎన్‌వీఏకు పంపారు. చివరిసారిగా ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీలను కొనుగోలు చేశామని, వాటిని పూణె ఎన్‌ఐవీలో ఉంచామని, అవి ఇవాళ కేరళకు చేరుకుంటాయని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.