దానిమ్మతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి.

దానిమ్మతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి దానిమ్మ(Pomegranate) దివ్య ఔషధంగా పనిచేస్తోందని ఆరోగ్య రంగ నిపుణులు చెప్తారు. రోజుకో దానిమ్మ తింటే ఆరోగ్యంగా ఉంటారు.. శరీరంలో రక్త ప్రసరణ కూడా సవ్యంగా సాగేలా సహాయపడుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా చేయడంతో గుండెపోటును నివారించొచ్చు. కొల్లెస్ట్రాల్‌ స్థాయిని కూడా తగ్గిస్తాయని చెప్తారు. కొలెస్ట్రాల్ తగ్గడంతో బ్లడ్ సర్క్యులేషన్‌కు చాలా ఈజీగా ఉంటుంది. దానిమ్మలోని యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడంతో జీవ ప్రక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్‌కు దూరం కావొచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యలను కూడా దానిమ్మ పండు తగ్గిస్తుంది. దానిమ్మ రసం, పండు , ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలపై, అలాగే రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ వంటి వాటికి దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ దరిచేరకుండా ఉంటుంది.

దానిమ్మ గింజల్లో పోషకాలు ఇలా ఉంటాయి.

1.క్యాలరీలు 72

2.ఫ్యాట్ 1 గ్రామ్

3.శాచురేటెడ్ ఫ్యాట్ 0.1గ్రామ్

4.కార్బోహైడ్రేట్స్ 16గ్రాములు

5.సోడియం 2.6మిల్లీ గ్రాములు

6.షుగర్ 11.9గ్రాములు

7.ఫైబర్ 3.48గ్రాములు

8.ప్రోటీన్ 45 గ్రాములు

9.పొటాషియం 205 మిల్లీ గ్రాములు

ehatv

ehatv

Next Story