కూరగాయల్లో(vegetables) అన్నింటికీ అన్నిశ్రేష్టమే.
కూరగాయల్లో(vegetables) అన్నింటికీ అన్నిశ్రేష్టమే. అన్ని కూరగాయలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్వచ్ఛమైన తాజా కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కూరగాయల్లో పొట్లకాయతో(snake gourd) కూడా చాలా ప్రయోజనాలున్నాయి. పొట్లకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చరపోతారు. పొట్లకాయలతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది, గుండె ఆరోగ్యాన్ని(healthy haert) మెరుగుపరుస్తుంది. మలబద్దక(constipation) సమస్యను కూడా పొట్లకాయ దూరం చేయగలదు. కాలేయం పనితీరును మెరుగుపర్చడమే కాకుండా.. చుండ్రు సమస్యను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడమే కాకుండా.. ఈ పొట్లకాయతో దంతాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపించడమే కాకుండా మూత్ర పిండాల పనితీరును మెరుగుపర్చేందుకు సహాయపడుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచేందుకు పొట్లకాయ సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న పొట్లకాయను వదిలిపెట్టే ప్రసక్తేలేదు.