మొక్క జొన్న(Corn) తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. దీనిని ఉడకబెట్టి లేదా నిప్పులమీద కాల్చి తింటారు. నిప్పులపై కాల్చిన మొక్కజొన్నపై కాస్త ఉప్పు, నిమ్మకాయబద్దతో రాసి తింటే ఆ రుచేవేరు. ఇది చాలా ఆరోగ్యకమైనది కావడంతో దీనిని తినేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. శరీరంలో రోగనిరోధకశక్తిని(Immunity Power) పెంచడానికి మొక్కజొన్న సహాయపడుతుందని ఆరోగ్యరంగ నిపుణులు చెప్తుంటారు.

అయితే మొక్క జొన్న తిన్న వెంటనే నీరు తాగకూడదని(Water) ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం మెుక్క జొన్న తిన్న తర్వాత నీరు తాగితే కడుపులో పలు రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు. జొన్న తిన్న తర్వాత చాలా మంది టకీమని నీరు తాగేస్తుంటారు. దీంతో ముఖ్యంగా కడుపులో వాతం, కడుపునొప్పి వస్తుందని అంటారు. నీరు తాగితే.. అపానవాయువు, తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందని ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు. సాధారణంగా మొక్కజొన్న తిని నీరు తాగిన తర్వాత కడుపు నొప్పి వస్తే దానికి కారణం మొక్కజొన్న కాదు. మొక్కజొన్న తిన్న తర్వాత కనీసం 45 నిమిషాల పాటు వేచి ఉండాలని చెప్తున్నారు. సాధారణంగా మొక్కజొన్నను నిప్పులో కాల్చి నిమ్మకాయ, మిరప పొడి, ఉప్పును మొక్కజొన్నపై రాసి తినాలని చెప్తారు. మొక్కజొన్నను నిమ్మరసంతో కలిపి తింటే జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. కొందరు మొక్క జొన్న ఇంటికి తెచ్చిన తర్వాత నిల్వ ఉంచుతారు. అలా కాంకుడా తెచ్చిన వెంటనే దానిని ఉడికించి తినాలంటున్నారు. దాని పూర్తి ప్రయోజనాలను పొందడానికి, తాజాగా ఉన్నప్పుడు తినడమే బెటరంటున్నారు. నిల్వ ఉంచి తింటే దానిపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మెుక్కజొన్నతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వదులుకోవద్దని.. దానిని తిన్న వెంటనే నీరు తాగొద్దని సూచిస్తున్నారు.

Updated On 30 Jan 2024 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story