ఆహార పదార్ధాల్లో ఉప్పుకి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదు. అందుకే ఆహారం తినే ప్రతీ ఒక్కరి శరీరంలోకి రోజూ కొంత ఉప్పు వెళ్తుంది. అయితే ఏదైనా మితంగా తింటనే ఆరోగ్యం..అధికంగా తింటే అనర్ధమని, ఆరోగ్యానికి చేటని వియెన్నా యూనివర్సిటీ(University of Vienna) వెల్లడించింది. అధికంగా ఉప్పు తింటున్న వారికి తినేవారికి చేదు వార్త అందించింది వియెన్నా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఉప్పు తక్కువ మోతాదులో తీసుకునేవారితో పోలిస్తే ఉప్పు అధికంగా తీసుకునే వారిలోనే కడుపు క్యాన్సర్(Cancer) ముప్పు 41 శాతం అధికంగా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడయింది.

దాదాపు 471,144 శాంపిల్స్ తీసుకొని పరిశోధించగా ఈ విషయం వెల్లడయింది. అధిక ఉప్పు తీసుకోవడం కడుపు యొక్క రక్షణ పొరను బలహీనపరుస్తుందని సూచించింది. దీంతో కణజాలం దెబ్బతిని క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పాశ్చాత్య దేశాలలో ఉప్పు మరియు కడుపు క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధం గురించి పరిశోధించామని వియన్నా విశ్వవిద్యాలయంలో పోషకాహార నిపుణుడు సెల్మా క్రోన్‌స్టైనర్-గిసెవిక్ చెప్పారు.
ప్రతిరోజూ 2,300 mg కంటే ఎక్కువ సోడియం తినకూడదని, ఇది దాదాపు ఒక టీస్పూన్ టేబుల్ ఉప్పుకు సమానమని సూచించింది. అయినప్పటికీ, వివిధ ఆహార పదార్థాలలో సగటు అమెరికన్ సాధారణంగా రోజుకు 3,400 మి.గ్రా. ఉప్పు తింటున్నారని తెలిపింది. మద్యం(Alcohol) సేవించడం మరియు ధూమపానం(smoking) వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెబుతోంది. 2024లో U.S.లో సుమారు 26,890 కొత్త కడుపు క్యాన్సర్ కేసులు నమోదవుతాయని వారు అంచనా వేస్తున్నారు. దాదాపు 10,880 మంది దీని వల్ల మరణిస్తున్నారు. కడుపు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే 75 శాతం నయమవుతుందని.. ఆలస్యం చేస్తే మాత్రం దీని స్థాయి 35 శాతానికే పడిపోతుందని వెల్లడించింది. కడుపు క్యాన్సర్ మీరు గమనించకుండానే అభివృద్ధి చెందుతుంది, ఎందుకంటే దాని లక్షణాలు సులభంగా బయటపడవు. అందుకే ఉప్పు తినడం తగ్గించాలని చెప్తున్నారు.
మరోవైపు డబ్ల్యూహెచ్‌వో(WHO) కూడా ఉప్పు అధికంగా తీసుకుంటే జరిగే దుష్ప్రభావాలపై ప్రకటన వెల్లడించింది. మోతాదుకు మించిన ఉప్పు శరీరంలోకి వెళ్లడం వల్ల గుండె, కిడ్నీ, మెదడుపై ప్రభావం చూపుతోందన్న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. శరీరంలో కీలక అవయవాలు దెబ్బతిని ప్రమాదం ఉందని చెబుతోంది. రక్తపోటు, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్థూలకాయం, కిడ్నీ వ్యాధులు బారినపడే అవకాశాన్ని ఉప్పు పెంచుతుందని తెలిపింది. శరీరంలో ‘సోడియం’ కీలకమే అయినా, రోజుకు 2000 మిల్లీగ్రాములు మించి తీసుకోకూడదని సూచిస్తోంది. ఉప్పుకు బదులు నిమ్మరసం, వెనిగర్, వోమ, నానబెట్టిన సబ్జ గింజలు మొదలైనవి ఆహారంలో వాడొచ్చునని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. ప్రాసెస్ చేసిన ఆహారం మానేయాలి. తప్పదనుకుంటే 100 నుంచి 120 మిల్లీగ్రాముల వరకు సోడియం ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొవచ్చు
తక్కువ ఉప్పు ఆహారం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కణాలలో నీరు నిలిచి ఉండడంతో ఉబ్బరం ఎక్కువ అవుతుంది. తక్కువ ఉప్పు కలిగిన ఆహారం కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే, మూత్ర విసర్జన ద్వారా ఎక్కువ కాల్షియం పోతుంది మరియు ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తక్కువ మోతాదులో ఉప్పు తింటే కిడ్నీల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అధిక ఉప్పు మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది.స