ఇవాళ్టి నుంచి పవితర రంజాన్(Ramzan) మాసం ప్రారంభం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఇది అత్యంత పవిత్రమైన మాసం. ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్‌లో ఇది తొమ్మిదవ నెల. ఈ మాసంలో ఉపవాసదీక్షలు(Fasting) ఉంటారు. ఈసారి వేసవి(Summer) కాలంలోనే పవిత్ర మాసం ప్రారంభమయ్యింది. అందుకే ఉపవాస దీక్షలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇవాళ్టి నుంచి పవితర రంజాన్(Ramzan) మాసం ప్రారంభం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఇది అత్యంత పవిత్రమైన మాసం. ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్‌లో ఇది తొమ్మిదవ నెల. ఈ మాసంలో ఉపవాసదీక్షలు(Fasting) ఉంటారు. ఈసారి వేసవి(Summer) కాలంలోనే పవిత్ర మాసం ప్రారంభమయ్యింది. అందుకే ఉపవాస దీక్షలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రోజా ఉంటున్నవారి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలని సూచించింది. రోజా సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలని చెప్పింది. వేసవి కాలం కాబట్టి చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి డీహైడ్రేట్(Dehydration) అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బలవర్ధకమైన ఆహారం తీసుకోమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఉపవాస సమయాల్లో బేకింగ్‌తో చేసిన పదార్థాలను అసలు తీసుకోకూడదు. పైగా ఉప్పు మితంగా వాడాలి. ఆవిరిపై ఉడికించినవి, కాల్చిన పదార్థాలను తీసుకోవడం మంచిదని చెప్పింది. ఉపవాసం విరమించిన తర్వాత మనకు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటాం. ఫిట్‌గా ఉండటానికి కాస్త వ్యాయామం అవసరం. అలాగే పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. రంజాన్ మాసాన్ని ఆహ్లాదభరితంగా వేడుకగా జరుపుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.