గోహనా జిలేబీని 1958లో దివంగత మాతూరాం ప్రారంభించారు.

గోహనా జిలేబీని 1958లో దివంగత మాతూరాం ప్రారంభించారు. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని ఆయన మనుమలు రామన్ గుప్తా, నీరజ్ గుప్తా నడుపుతున్నారు. దేశవాళీ నెయ్యితో ఈ జిలేబీ తయరు చేస్తారు. 250 గ్రాముల బరువుతో నాలుగు బిలేబీల బాక్సు 320 రూపాయలకు అమ్ముతారు. వారం రోజుల పాటు ఈ స్వీట్ నిల్వ కూడా ఉంటుంది. గోహనా లో చాలా పెద్ద ఆహార ధాన్యాల మార్కెట్ ఉండటంతో ఇక్కడి రైతులు రోజంతా పొలం పనులు చేసుకుంటారు. . ప్రతికూల పరిస్థితుల్లోనూ వీరు సేద్యం మానరు. దేశవాళీ నెయ్యితో తయారు చేసే ఈ పెద్ద జిలేబీలు వారికి అవసరమైన కేలరీ లను ఇస్తుందని, ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉండటంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేందుకు వారు వీటిపై ఎక్కువ మక్కువ చూపుతారని రామన్ గుప్తా తెలిపారు. మొదట్లో చిన్న దుకాణంగా ఉండే వీరి వ్యాపారం ఆ తర్వాత బాగా విస్తరించింది. ప్రముఖ రాజకీయ నేతలు సైతం గోహనా వైపు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇక్కడకు వచ్చి జిలేబీలు పెద్ద ఎత్తున ఆర్డర్ ఇస్తుంటారు..

Eha Tv

Eha Tv

Next Story