మద్యం(Alcohol) తాగడం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. ఎక్కువగా తాగితే ప్రాణాలకు ముప్పురావచ్చు. ఈ విషయం తాగుబోతులకు కూడా తెలుసు. అయినా సరే తాగుడు మానడం లేదు. పైగా రోజురోజుకీ మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. మద్యాన్ని సేవించడం చాలా ప్రమాదం. మద్యానికి బానిసయ్యారా ఇక అంతే సంగతులు. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి.

మద్యం(Alcohol) తాగడం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. ఎక్కువగా తాగితే ప్రాణాలకు ముప్పురావచ్చు. ఈ విషయం తాగుబోతులకు కూడా తెలుసు. అయినా సరే తాగుడు మానడం లేదు. పైగా రోజురోజుకీ మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. మద్యాన్ని సేవించడం చాలా ప్రమాదం. మద్యానికి బానిసయ్యారా ఇక అంతే సంగతులు. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి మద్యం తాగుతూ ఒక్కసారి తాగడం మానేసినా ప్రమాదమే. బాగా తగ్గించినా అంతే!మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. తక్షణం వైద్య సహాయం తీసుకోకపోతే ప్రాణాలు కూడా పోవచ్చంటున్నారు. మద్యం సేవించిన తర్వాత నరాలలో కొత్త ఉత్సాహం వస్తుంది. రోజూ తాగితే నరాలు కూడా మద్యానికి అలవాటుపడతాయి. అదో వ్యసనంగా(Addiction) మారుతుంది. మద్యం తాగకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితిని ఆల్కహాల్‌ విత్‌డ్రావల్‌(Alcohol withdrawal) అని అంటారు. ఇది మరింత ముదిరితే మాత్రం ఫిట్స్‌(Fits) వస్తాయి. అలాగే మతి భ్రమిస్తుంది. ప్రాణం పోయే అవకాశాలు కూడా ఉంటాయి. మద్యానికి అలవాటు పడిన నరాలు స్థిమితంగా ఉండవు. కాస్త మందు తాగితే కాని అవి కుదుటపడవు. అంతిమంగా ప్రాణాలు కూడా పోవచ్చని అంటున్నారు వైద్యులు. అధిక రక్తపోటు, నిద్రలేమి, శరీరభాగాలు బాగా వణికిపోవడం, ఆందోళన, కడుపునొప్పి, తలనొప్పి, గుండెదడ వంటివి ఆల్కహాల్‌ విత్‌డ్రాయల్ లక్షణాలు. తాగడానికి అలవాటుపడితే జీర్ణవ్యవస్థపై అస్తవ్యస్థమవుతుంది. కాలేయం దెబ్బతింటుంది. దేనిపైనా ఏకాగ్రత ఉండదు. పాదాలు, చేతలు తిమ్మిరి పట్టేస్తాయి. అంచేత తాగుడు మానేయండి.. ఆరోగ్యంగా ఉండండి.

Updated On 12 April 2024 4:46 AM GMT
Ehatv

Ehatv

Next Story