ఆల్కహాల్‌(Alcohol) లవర్స్‌కు ఇది శుభవార్తేనని చెప్పాలి. రోజూ మందు తాగే ఆల్కహాల్‌ లవర్స్‌.. దానితో పాటు రోజూ ఒక గ్లాస్‌ ద్రాక్ష పళ్ల జ్యూస్‌(Grape juice) తాగాలని ఆరోగ్య రంగ నిపుణులు చెప్తున్నారు. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పండ్లలో ద్రాక్ష ఒకటి. క్యాన్సర్(Caner) నివారణ, హెల్తీ వెయిట్‌ను మెయింటెయిన్‌ చేసేందుకు ద్రాక్ష ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌లో విటమిన్ సి(Vitamin c), ఫోలిక్ యాసిడ్(Pholic acid), ఐరన్, పొటాషియం, కాల్షియం అధిక స్థాయిలో ఉంటాయి.

ఆల్కహాల్‌(Alcohol) లవర్స్‌కు ఇది శుభవార్తేనని చెప్పాలి. రోజూ మందు తాగే ఆల్కహాల్‌ లవర్స్‌.. దానితో పాటు రోజూ ఒక గ్లాస్‌ ద్రాక్ష పళ్ల జ్యూస్‌(Grape juice) తాగాలని ఆరోగ్య రంగ నిపుణులు చెప్తున్నారు. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పండ్లలో ద్రాక్ష ఒకటి. క్యాన్సర్(Cancer) నివారణ, హెల్తీ వెయిట్‌ను మెయింటెయిన్‌ చేసేందుకు ద్రాక్ష ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌లో విటమిన్ సి(Vitamin c), ఫోలిక్ యాసిడ్(Pholic acid), ఐరన్, పొటాషియం, కాల్షియం అధిక స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా లివర్‌ డ్యామేజ్‌(Liver damage) కాకుండా ద్రాక్ష రసం కంట్రోల్‌ చేస్తుందంటున్నారు.

ప్రతీరోజూ ఆల్కహాల్‌ తీసుకునేవారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయన్న విషయం తెల్సిందే. కొందరికి సరదా, సరదాకు అలవాటైన తర్వాత.. రోజుకు రెండు పెగ్గులు వేయాల్సిందేనన్న స్థాయికి వెళ్లిపోతారు. రెండు వెయ్యకుంటే నరాలు జివ్వుమంటాయంటారు. రోజూ మద్యం సేవించడంతో లివర్‌పై అధిక భారం పడడమే కాకుండా క్రమంగా లివర్‌ కూడ డ్యామేజ్‌ అవుతుందంటారు. ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ వల్ల క్రమక్రమంగా అది పనిచేయడం తగ్గిస్తుంది. మద్యం సేవించడంతో లివర్‌ డ్యామేజ్‌తో పాటు ఇతర ఆరోగ్య సమ్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆరోగ్య రంగ నిపుణులు ఓ పరిష్కార మార్గాన్ని చూపెడుతున్నారు. రోజు 500 మీ.లీ. ద్రాక్ష రసం తాగితే మంచిదని చెప్తున్నారు. రోజూ మద్యం తీసుకునేవారికి. గ్రేప్‌ జ్యూస్‌ వల్ల ఆర్థికభారం కానేకాదంటున్నారు. ఆల్కాహాల్‌తో కాలేమయం సెల్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా ఇవి కాపాడతాయి. అలానే గ్రేప్ జ్యూస్ వల్ల ఏడీహెచ్ అనే ఎంజెమ్ ఉత్పత్పి శరీరంలో పెరుగుతుంది. ఏడీహెచ్ ఎంజెమ్‌ మద్యాన్ని త్వరగా విచ్చిన్నం చేసి లివర్ డ్యామేజ్‌ను అరికడుతుందంటున్నారు. అంతే కాకుండా ఇన్ఫెక్షన్లు(Infection), క్యాన్సర్ , అలెర్జీల(Allergy) నుంచి కాపాడుతుందంటున్నారు. జీర్ణప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా, తలనొప్పి నుంచి ఉపశమనం, జుట్టు పెరిగేందుకు, ఎముకల బలం పెరగడానికి ఈ గ్రేప్‌ జ్యూస్‌ మంచిదంటున్నారు. సో ఆల్కాహాల్ లవర్స్.. మీరు రోజూ మద్యాన్నే కాదు.. ఓ గ్లాస్‌ గ్రేప్‌ జ్యూస్‌ను కూడా లివర్‌కు పంపించండి.

Updated On 24 Jan 2024 6:58 AM GMT
Ehatv

Ehatv

Next Story