ప్రస్తుతం బియ్యం (rice)ధరలు భారీగా పెరిగాయి. ఇకపై కూడా ఇలాగే కొనసాగితే సామాన్యుడిపై భారం పడక తప్పదు. దీంతో బియ్యం ధరలు మరిన్ని పెరుగుతాయన్న ఆందోళనతో ఒకే సారి క్వింటాల్ లేదా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు
ప్రస్తుతం బియ్యం (rice)ధరలు భారీగా పెరిగాయి. ఇకపై కూడా ఇలాగే కొనసాగితే సామాన్యుడిపై భారం పడక తప్పదు. దీంతో బియ్యం ధరలు మరిన్ని పెరుగుతాయన్న ఆందోళనతో ఒకే సారి క్వింటాల్ లేదా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. బియ్యం నిల్వ ఉంచినప్పుడు మనకు ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే బియ్యంలో పురుగులు (insects)రావండం. బియ్యానికి పురుగుపట్టకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా వాటిని నిరోధించలేకపోవడంతో కష్టపడి కొనుక్కున్న బియ్యం కాస్త వృధాగా మారిపోతున్నాయి. దీంతో ఈ చిన్న చిన్న చిట్కాలు (tips)ప్రయోగిస్తే బియ్యంలో పరుగులు కనపడవని చెప్తున్నారు.
బే లీఫ్ (bay keaf)దీనినే బిర్యానీ (biryani)ఆకు అని కూడా అంటారు. మనం వాడే బిర్యానీ ఆకు గురించి తెలియని వారుండరు. బిర్యానీలో దీని పాత్ర ఎంత ఉంటుందో తెలియందికాదు. బిర్యానీలోనే కాకుండా ఇతర వంటకాల్లో కూడా దీన్ని వాడుతారు. మంచి సువాసన ఇవ్వడంలో ఈ ఆకు కీలక పాత్ర పోషిస్తుంది. ఆహార పదార్థాల్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ రావడమే కాదు. మన ఆరోగ్యానికీ దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉన్న పోషక విలువల వల్ల అది రకరకాలుగా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ బిర్యానీ ఆకు వాసన మాత్రం పురుగులు, కీటకాలకు నచ్చదంట. బియ్యంలో నాలుగైదు ఆకులు వేస్తే పరుగు దరిచేరదని చెప్తున్నారు.
బియ్యంలో పురుగులు రాకూడదంటే మరో మార్గం ఏంటంటే.. ఎర్ర మిరపకాయలు (red chilly)బియ్యంలో ఉంచడం. రోజు వారీ వంటలలో దీనిని ప్రధానంగా ఉపయోగిస్తాం. ఎర్రమిరపకాయలో ఉండే ఆల్కలీనిటీ మనకు దాహాన్ని కలిగిస్తుంది. దీని ఘాటుకు కూడా బియ్యంలో పురుగులు రావని చెప్తున్నారు.
వేప ఆకులో (neem leaves)ఉండే ఔషధ గుణాలు మనందరికీ తెలిసిందే. ఇది తెగుళ్లను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. నిల్వ చేసిన బియ్యంలో ఈ ఆకును ఉంచితే నెలల తరబడి పాడవవు. ఈ ఆకులు కీటకాలను తట్టుకుంటాయి.
ఎల్లిపాయలు (garlic)కూడా పొట్టు తీయకుండా బియ్యంలో ఉంచాలంటున్నారు. బియ్యంలోపల ఈ రెబ్బలను ఉంచితే కూడా పురుగు పట్టదు. బియ్యంలో పురుగులు రాకుండా కాపాడే మరో వస్తువు లవంగాలు. లవంగాలను లేదా లవంగాల పొడిని బియ్యం సంచుల లోపల మూటకట్టి పెట్టడం వల్ల బియ్యం పురుగులు పట్టదు.