మీ చర్మం అనారోగ్యంతో(Skin health) ఉంది అంటే.. మీరు చేసే పనుల్లో ఏదో లోపం ఉంది అని అర్ధం.. అందుకే చర్మానికి నష్టం కలిగించే అలవాట్లు ఏంటో తెలుసుకుని వాటినివెంటనే మానేయండి.. వాటికి దూరంగా ఉండండి.
మీ చర్మం అనారోగ్యంతో(Skin health) ఉంది అంటే.. మీరు చేసే పనుల్లో ఏదో లోపం ఉంది అని అర్ధం.. అందుకే చర్మానికి నష్టం కలిగించే అలవాట్లు ఏంటో తెలుసుకుని వాటినివెంటనే మానేయండి.. వాటికి దూరంగా ఉండండి.
వయసు పెరిగే కొద్దీ ముఖంలో ముడతలు(Wrinkles) రావడం సహజం. కానీ కొందరికి చిన్న వయసులోనే ముఖంలో ముడతలు వస్తాయి. మీకు ఉన్న కొన్ని చెడు అలవాట్లే దీనికి కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు కలిగి ఉన్న చెడు అలవాట్లు మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండండి.
కోపం(angry) మరియు అధిక ఒత్తిడి చర్మాన్ని దెబ్బతీస్తుంది. ఇవన్నీ మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. ఒత్తిడి(Pressure) వల్ల కార్టిసాల్(Cortisol) అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. అది మీ చర్మకాంతిని దూరం చేస్తుంది. మీ ముఖంలో రోగ లక్షణాలు కనిపించేలా చేస్తుంది.
ఎక్కువ సూర్యరశ్మి(Sunrays) వల్ల ముఖంపై ముడతలు వస్తాయి. అందుకే చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. మీరు బయటికి వెళ్ళినప్పుడల్లా సన్‌స్క్రీన్ అప్లై చేయడం చాలా అవసరం. ఎందుకంటే సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల చర్మానికి ఎక్కువ నష్టం కలుగుతుంది.
మీ చర్మం ఎప్పుడూ పొడిగా ఉంటే(Dry skin), ఫలితంగా మీ చర్మం త్వరగా ముడతలు పడటం ప్రారంభమవుతుంది. కాబట్టి, మీ చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోండి. అందుకు మంచి మాయిశ్చరైజర్లు(Moisturizers) వాడటం మంచిది. కాని గుర్తుంచుకోండి.. కెమికల్ ఆధారిత సౌందర్య సాధనాలు కూడా మీ చర్మానికి హానికరం.
ధూమపానం మరియు మద్యపానం మీ శరీరం మరియు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ అలవాట్లు మీ రక్త ప్రసరణను నెమ్మదిస్తాయి. ఇది చర్మం యొక్క వృద్ధాప్య ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఒకవేళ మీకు ఈ అలవాట్లు ఉంటే మానేయండి.. లేదా మితంగా ఉపయోగించండి.