గర్భాశయ(Uterus) తొలగింపు తర్వాత ఆరోగ్యకర ఆహారంతో(Healthy Food) పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కుట్టు తొలగించిన తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ప్రాంతంలో తడిగా ఉండకుండా చూసుకోవాలి. ఆహారంతో పాటు తగిన విశ్రాంతి తీసుకోవాలి. కనీసం 8 గంటలు నిద్రపోవాలి(Sleep). ప్రతిరోజు ధ్యానం, యోగా(Yoga) చేయాలి.
గర్భాశయ(Uterus) తొలగింపు తర్వాత ఆరోగ్యకర ఆహారంతో(Healthy Food) పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కుట్టు తొలగించిన తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ప్రాంతంలో తడిగా ఉండకుండా చూసుకోవాలి. ఆహారంతో పాటు తగిన విశ్రాంతి తీసుకోవాలి. కనీసం 8 గంటలు నిద్రపోవాలి(Sleep). ప్రతిరోజు ధ్యానం, యోగా(Yoga) చేయాలి. గర్భాశయం తొలగించిన తర్వాత సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. గర్భాశయ శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. సాధారణ స్థితికి చేరుకున్నా సరే గర్భసంచి తొలగింపు తర్వాత నిద్రలేమి, చిరాకు, హార్మోన్ల మార్పులతో(Mood Swing) బరువు పెరగడం(Weight Gain) జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్‌వాజినల్ హిస్టెరెక్టమీ అనే ప్రక్రియ యోనిలో కోత విధిస్తారు. ఆ తర్వాత గర్భాశయం తొలగిస్తారు. పొత్తి కడుపులో చాలా చిన్న కోతల ద్వారా చిన్న కెమెరాతో చిన్న వెలుగుతో కూడిన ట్యూబ్ కడుపులోకి పంపించి ఆపరేషన్ పూర్తి చేస్తారు.
కుట్లు(stiches) ఎప్పుడూ శుభ్రంగా, తడి లేకుండా చూసుకోవాలి. కుట్లు తొలగించిన తర్వాత శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ప్రాంతంలో తడిగా ఉండకుండా చూసుకోవాలి. కుట్లు వేసిన ప్రదేశంలో ఎరుపు రంగులో గాయంలాంటిది కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. సొంత వైద్యం(Own treatment) చేసుకోవద్దంటున్నారు నిపుణులు. కుట్లు తగ్గే వరకు వదులుగా ఉండే బట్టలను(Loose Clothes) వేసుకోవాలి. దురదగా ఉన్నా రుద్దుకునే ప్రయత్నం చేయకూడదు. ఆహారంలో సీజనల్ పండ్లను తీసుకోవాలి. కూరగాయలతోపాటు ఫైబర్, హైడ్రేషన్ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా పండ్ల రసాలకు దూరంగా ఉండాలి, కొవ్వు పదార్థాల ఆహారాలు, మసాలాలు తినొద్దు, ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఆహారంగా తీసుకోకూడదు.
గర్భాశయం తొలగించిన విశ్రాంతి తీసుకోవాలి. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ప్రతిరోజు ధ్యానం, యోగా చేస్తే రోగులు చురుకుగా ఉంటారు. బరువులు ఎత్తితే కుట్ల మీద ఒత్తిడి పడుతుంది. నిద్రపోయేముందు సెల్‌ఫోన్, టీవీ చూడవద్దు. ఇవి నిద్రపై ప్రభావం చూపుతాయి. నిద్రపోయే ముందు టీ లేదా కాఫీ తాగకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు.