కొందరికి ఉదయం లేవగానే తలనొప్పి(Headache) వస్తుంది. దీనికి చాలా కారణాలున్నాయి. స్లీప్ అప్నియా, మైగ్రేన్‌లు(Migrane) మరియు నిద్రలేమి వంటివి ఉదయం తలనొప్పికి సాధారణ కారణాలని చెబుతారు.మద్యం అతిగా తాగడం.. కొన్ని రాత్రి వాడే మందుల ప్రభావంతో కూడా ఉదయం తలనొప్పికి కారణమవుతాయి.
కొందరికి ఉదయం లేవగానే తలనొప్పి(Headache) వస్తుంది. దీనికి చాలా కారణాలున్నాయి. స్లీప్ అప్నియా, మైగ్రేన్‌లు(Migrane) మరియు నిద్రలేమి వంటివి ఉదయం తలనొప్పికి సాధారణ కారణాలని చెబుతారు.మద్యం అతిగా తాగడం.. కొన్ని రాత్రి వాడే మందుల ప్రభావంతో కూడా ఉదయం తలనొప్పికి కారణమవుతాయి.
మెదడులోని హైపోథాలమస్ సాధారణంగా నిద్ర మరియు నొప్పి ప్రక్రియలలో పాల్గొంటుంది. హైపోథాలమస్ మీ సహజ సిర్కాడియన్ స్లీపింగ్ టైమ్ ను నియంత్రిస్తుంది. అంతే కాదు ఇది నొప్పిని మాడ్యులేట్ చేస్తుంది. నిద్రలో హైపోథాలమస్‌లో ఆటంకాలు నొప్పిని తట్టుకునే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా, మీరు నిద్రపోతున్నప్పుడు నొప్పిని అనుభవించకపోవచ్చు అది ఉదయం లేవగానే నోప్పి లేవడం స్టార్ట్ అవుతుంది.
డిప్రెషన్(Depression) లేదా యాంగ్జయిటీ(Anxity) ఉన్న వ్యక్తులు మైగ్రేన్‌లను ఎదుర్కొనే అవకాశం ఉంది. మరియు మైగ్రేన్లు మానసిక ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి అలసటకు దారితీస్తాయి. గుర్తు పెట్టుకోండి.. నిద్ర సరిగ్గా లేక పోతే తలనొప్పి వచ్చినట్టే అనుకోండి. అంతే కాదు సరిగ్గా నిద్రపట్టకపోయినా.. అది తలనొప్పికి కారణమవుతుంది.
ఇటువంటి టైమ్ లోనే.. చాలా జాగ్రత్తగా మీ నిద్ర టైమ్(sleep Duration) ను పెంచుకోండి.. నాన్యమైనర నిద్ర. అంటే.. ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలిగితే.. మీకు ఎటువంటి తలనొప్పులు ఉండవు.
చిన్న మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్న సరే అది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. ఉదయం తలనొప్పికి అనేక కారణాలు దారి తీయవచ్చు. ఆల్కహాల్ వల్ల ఎక్కువ సార్లు మూత్రవిసర్జన అవుతుంది. దాని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అంతే కాదు ఆల్కాహాల్ వల్ల డీహైడ్రేట్ అవుతారు.. అది తలనొప్పికి దారి తీస్తుంది. అంతేకాదు మద్యం మైగ్రేన్లకు ట్రిగ్గర్ కావచ్చు.
మీరు ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మీకు తలనొప్పి ఉంటే, కారణం గురించి మీ వైద్యునితో మాట్లాడండి. మీ లక్షణాలు మరియు నిద్ర అలవాట్లను ట్రాక్ చేయడానికి స్లీప్ డైరీని ఉంచడం వలన మీ ఉదయం తలనొప్పి ప్రభావాన్ని తగ్గించవచ్చు మరియు మీ నిద్ర పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది.
ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకుని లేవండి. క్రమం తప్పకుండా వ్యాయామం(Exercise) చేయండి: నిద్రించడానికి కొన్ని గంటల ముందు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. అయితే, నిద్రవేళకు చాలా దగ్గరగా వ్యాయామం చేయకుండా ఉండండి.
కెఫిన్(Caffine) మరియు ఆల్కహాల్(Alcohol) తగ్గించండి. ఇవి మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. మీరు నిద్రపోయే ప్రదేశం చీకటిగా, చల్లగా మరియు తక్కువ శబ్దంతో ఉండాలి. మీ బెడ్ వినియోగాన్ని సెక్స్ మరియు నిద్రకు మాత్రమే పరిమితం చేయండి. నిశ్శబ్ద స్నానం, పఠనం లేదా ధ్యానం ప్రయత్నించండి. ఇలా మీరు మీ ఉదయం తలనొప్పిని తగ్గించుకోవచ్చు.