అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్(Ultra-processed foods) తీసుకోవడం వల్ల క్యాన్సర్(Cancer), శ్వాసకోశ, కార్డియోవాస్కులర్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్ వంటి 32 వ్యాధుల ముప్పు పెరుగుతుందని ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్‌ల పరిశోధకుల బృందం కనుగొంది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల గుండె జబ్బుల నుంచి మరణించే ప్రమాదం 48-53 శాతం పెరుగుతుందని తేలింది. డిప్రెషన్, సాధారణ మానసిక రుగ్మత, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా 12 శాతం పెరుగుతుంది.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్(Ultra-processed foods) తీసుకోవడం వల్ల క్యాన్సర్(Cancer), శ్వాసకోశ, కార్డియోవాస్కులర్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్ వంటి 32 వ్యాధుల ముప్పు పెరుగుతుందని ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్‌ల పరిశోధకుల బృందం కనుగొంది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల గుండె జబ్బుల నుంచి మరణించే ప్రమాదం 48-53 శాతం పెరుగుతుందని తేలింది. డిప్రెషన్, సాధారణ మానసిక రుగ్మత, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా 12 శాతం పెరుగుతుంది. అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాల వినియోగంతో వ్యక్తి యొక్క మరణ ప్రమాదాన్ని 21 శాతం పెంచిందని, 40-66 శాతం గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్‌తో మరణించే ప్రమాదం ఉందని బృందం ఆధారాలు కనుగొంది. అదే సమయంలో, నిద్ర సమస్యలు, డిప్రెషన్ ప్రమాదం కూడా 22 శాతం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్, నిద్ర సమస్యలు, గురక, క్యాన్సర్, జీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదానికి కారణమవుతుందని పరిశోధకలు చెప్తున్నారు. అల్ట్రా-ప్రాసెస్ ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్(Chest Cancer), ట్యూమర్(Tumer), క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా, కొలొరెక్టల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.
ప్రిజర్వేటివ్‌లు(Preservatives), కృత్రిమ పదార్ధాలను ఉపయోగించి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్‌ను తయారు చేస్తారు. ఇవి సాధారణంగా ఎక్స్‌ట్రాషన్, హైడ్రోజనేషన్, అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేస్తారు. ఉదాహరణకు, స్వీట్ స్నాక్స్, ప్యాక్డ్ బేక్డ్ గూడ్స్, ఫాస్ట్ ఫుడ్, స్వీట్ డ్రింక్స్ కూడా ఇదే విధంగా తయారు చేస్తారు. ఈ ఆహారాలలో సాధారణంగా అవసరమైన పోషకాలు, ఫైబర్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర, ఉప్పు అధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహమే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లతో సహా అనేక సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.