మొక్కజొన్న(Corn) సీజనల్ గా చాలా ఇష్టపడతారు.. రకరకాల పద్దతుల్లో తింటారు. ఎలా తిన్నా కాని... ఈ మొక్క జొన్నలో ఉన్న పోషకాలు, మంచి గుణాల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి అవేంటో చూద్దామా..?

మొక్కజొన్న(Corn) సీజనల్ గా చాలా ఇష్టపడతారు.. రకరకాల పద్దతుల్లో తింటారు. ఎలా తిన్నా కాని... ఈ మొక్క జొన్నలో ఉన్న పోషకాలు, మంచి గుణాల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి అవేంటో చూద్దామా..?

** ఫోలిక్ యాసిడ్ లేకపోవడం, విటమిన్ బి12 లోపం, ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఈ రక్తహీనత(Blood deficiency) లోపాన్ని అధిగమించడానికి మొక్కజొన్న సహాయపడుతుంది.

** మొక్కజొన్న ఎక్కువ రుచిని కలిగి ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. కొవ్వు తక్కువగా(Fat less food) ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు కూడా ఉన్నాయి.

** ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు(Digestion) మంచిది. కొవ్వు పోషకాలు రక్తంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

** మలబద్ధకాన్ని(constipation) తొలగిస్తుంది. పేగు వ్యాధులు దూరమవుతాయి. పేగులను క్లీన్ చేస్తుంది. పేగుల్లోపేరుకుపోయిన మలాన్ని బయటకు లాగేస్తుంది.

** విటమిన్ బి12 లోపం మరియు ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఇనుము లోపం కూడా రక్తహీనతకు కారణం కావచ్చు. మొక్కజొన్న వీటిని నివారిస్తుంది.

** అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా, మొక్కజొన్న శక్తిని అందిస్తుంది. ఇది మెదడు మరియు నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.

** చెడు కొవ్వును తొలగిస్తుంది. విటమిన్ 'సి'లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తక్కువగా ఉన్నవారు దీనిని తీసుకుంటే బరువు పెరుగుతారు.

** పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. డయాబెటిస్ కేటగిరీ 2 రోగులు రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను నియంత్రించడానికి దీన్ని మితంగా తీసుకోవాలి.

Updated On 9 May 2024 7:02 AM GMT
Ehatv

Ehatv

Next Story