పండ్లు(Fruits) ఆరోగ్యానికి చాలా మంచిది.. ప్రతీ సీజన్ లో వచ్చే పండ్లను మనం తినడంతో పాటు.. పిల్లలచేత తినిపిస్తే.. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అందకే మర్చిపోకుండా పండ్లు తినండి.. తినిపించండి.

పండ్లు(Fruits) ఆరోగ్యానికి చాలా మంచిది.. ప్రతీ సీజన్ లో వచ్చే పండ్లను మనం తినడంతో పాటు.. పిల్లలచేత తినిపిస్తే.. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అందకే మర్చిపోకుండా పండ్లు తినండి.. తినిపించండి.

అయితే కొన్ని పండ్లు తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా కొన్ని పండ్లు తిన్న తరువాత నీళ్లు(Water) అస్సలు తాగవద్దు. ఆ పండ్లేంటో తెలుసుకుందాం..

ఇది సమ్మర్ కావడంతో.. పుచ్చకాయను(Watermelon) ఎక్కవగా తీసుకుంటుంటారు జనాలు. అయితే పుచ్చకాయలో ఎక్కువగా నీరు శాతం ఉంటుంది. అందుకే పుచ్చకాయ తిన్న తరువాత మళ్ళీ సపరేట్ గా నీరు తాగకండి.. దాని వల్ల జీర్ణ వ్యవస్తలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆపిల్(Apple) అంటే చిన్నా పెద్దా అందరికి ఎంతో ఇష్టం ఉంటుంది కాని.. అవి తిన్న తరువాత మాత్రం నీళ్లు వెంటనే తాగవద్దనంటున్నారు. దాని వల్ల జీర్ణ వ్యవస్ధ పై ప్రతీకూల ప్రభావం పడుతుందంట.

అంతే కాదు సిట్రస్ పండ్లు.. అనగా.. కమలాలు, బత్తాయిలు లాంటి పుల్లటి పండ్లు తిన్నాక వెంటనే నీరు తాగితే.. శరీరంలో పీహెచ్ పడిపోతుంది. పళ్లు జివ్వుమంటాయి. అందుకే పుల్లటి పండ్లు తిన్నాక నీరు తాగకండి.

అరటిపండులో(Banana) ఆరోగ్యగుణాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ పండుతిన్న తరువాత వెంటనే నీళ్లు మాత్రం తాగకూడదట. దాని వల్ల రక్త పరిమాణం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

దానిమ్మ పండు తిన్న తరువాత కూడా నీళ్ళు తాగకూడదట. దాని వల్ల ఎసిడిటీ సమస్య పెరిగి..ఆతరువాత రోజుల్లో వాంతులు, వికారం పెరిగే అవకాశం ఉంది.

Updated On 11 April 2024 4:36 AM GMT
Ehatv

Ehatv

Next Story