ప్రస్తుత పరిస్థితుల్లో బీపి(BP), షుగర్(Sugar), థైరాయిడ్(Thyroid) , గ్యాస్ లాంటి సమస్యలు వయస్సుతో సబంధం లేకుండా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా థైరాయిడ్ సమస్య చాలామందిని పట్టి పీడిస్తుంది. రోజు మందులు మింగుతూ.. బ్రతకాల్సిన పరిస్థితి నుంచి నేచురల్ ఫుడ్స్ తో థైరాయిడ్ ను తరిమే ఉపాయం ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుత పరిస్థితుల్లో బీపి(BP), షుగర్(Sugar), థైరాయిడ్(Thyroid) , గ్యాస్ లాంటి సమస్యలు వయస్సుతో సబంధం లేకుండా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా థైరాయిడ్ సమస్య చాలామందిని పట్టి పీడిస్తుంది. రోజు మందులు మింగుతూ.. బ్రతకాల్సిన పరిస్థితి నుంచి నేచురల్ ఫుడ్స్ తో థైరాయిడ్ ను తరిమే ఉపాయం ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా మనిషి ఎప్పుడూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటాడు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మీకు తెలుసా.. మనం తినే ఆహారం సమస్యలను సృష్టిస్తుంది.ఈరోజుల్లో ఎవరితో మాట్లాడినా ఈ జబ్బు ఉంది, ఆ జబ్బు ఉంది అని చెబుతూనే ఉన్నారు. ఆ మేరకు కాలం మారింది. మనిషి ఎప్పుడూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటాడు. కాని మనం జాగ్రత్తగా ఉండి.. తినేతిండి ద్వారానే ఆరోగ్యాని కాపాడుకోవచ్చు.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. చాలా మందికి చాలా చిన్న వయస్సులోనే హైపోథైరాయిడిజం వస్తుంది. థైరాయిడ్ జీవక్రియపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడు సమస్యలు మొదలవుతాయి. కానీ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే థైరాయిడ్ ను అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి(Coconut) లేదా కొబ్బరి నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలు థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం అని చెప్పవచ్చు. కొబ్బరిని తినడం వల్ల థైరాయిడ్ స్థాయి అదుపులో ఉంటుంది. అంతే కాకుండా, ఇది శరీరం యొక్క పనితీరుకు కూడా సహాయపడుతుంది. రోజూ ఒక చెంచా కొబ్బరిని తింటే థైరాయిడ్ తగ్గుతుంది. అంతే కాకుండా చర్మం, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి.

జామకాయలో(Guva) చాలా ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఇందులో రోగనిరోధక శక్తిని(Immune system) పెంచే గుణాలు ఉన్నాయి. జామకాయ రసం తాగడం లేదా జామకాయను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. ఇది థైరాయిడ్ సమస్య మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. ఉసిరికాయలో నారింజ కంటే 8 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అంతే కాకుండా శరీరాన్ని దృఢంగా మార్చుతుంది.

గుమ్మడి గింజలు కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌లో(Dry fruits) భాగమయ్యాయి. గుమ్మడి గింజల్లో శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. ఈ గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ విటమిన్లు మరియు మినరల్స్ వంటి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గుమ్మడి గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల థైరాయిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

Updated On 24 Jan 2024 7:47 AM GMT
Ehatv

Ehatv

Next Story